yahoo begins shuttering some digital service

Yahoo shuts down digital magazines

Yahoo, Alibaba, magazines, workforce, Martha Nelson, San Francisco, yahoo news, yahoo sports, yahoo finance, yahoo lifestyle. digital magazines, Yahoo Food, Yahoo Health, Yahoo Parenting, Yahoo Makers, Yahoo Travel, Yahoo Autos, Yahoo Real Estate, Marissa Mayer

Yahoo has begun shutting down some of its digital magazines as the struggling online pioneer's latest reorganization plan.

డిజిటల్ మ్యాగజైన్లను గుడ్ బై చెప్పనున్న యాహూ..

Posted: 02/19/2016 11:09 AM IST
Yahoo shuts down digital magazines

ఇంటర్నెట్ సంస్థ యాహూ.. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణపై మరింతగా కసరత్తు చేస్తోంది. ఇంటర్ నెట్ లో డిజిటల్ మ్యగజైన్లు అవిష్కరించి.. వాటికి అత్యంత ఆదరణ కలిగేలా చర్యలు తీసుకున్న అగ్రగామి సంస్థ త్వరలో వాటికి స్వస్తి పలకనుంది. నమ్మశక్యంగా లేదా..? కానీ ఇది నిజం. ప్రత్యర్థి కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న తరుణంలో కొన్ని డిజిటల్ మ్యాగజైన్స్‌ను నిలిపివేయనున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించింది. అంతేకాదు ఈ మేరకు తన నిర్ణయాన్ని అమలు పర్చడం కూడా మొదలుపెట్టింది.

యాహూ ఫుడ్, హెల్త్, పేరెంటింగ్, మేకర్స్, ట్రావెల్, ఆటోస్, రియల్ ఎస్టేట్ మ్యాగజైన్లను దశలవారీగా మూసివేయనున్నట్లు సంస్థ గ్లోబల్ ఎడిటర్ ఇన్ చీఫ్ మార్తా నెల్సన్ తమ బ్లాగ్‌లో వెల్లడించారు. యాహూను వృద్ధి బాట పట్టించే దిశగా ఉత్పత్తులు, వనరులపరంగా మరింత సాహసోపేత ప్రణాళికను అమలు చేయాల్సి ఉంటుందని కంపెనీ సీఈవో మరిస్సా మెయర్ ఇటీవలే పేర్కొన్నారు. దీని ప్రకారం దాదాపు 1,500 ఉద్యోగాల్లో కంపెనీ కోత విధించనుంది. దుబాయ్, మెక్సికో సిటీ, బ్యూనస్ ఎయిర్స్, మ్యాడ్రిడ్, మిలాన్ తదితర ప్రాంతాల్లో కార్యాలయాలను మూసివేయనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yahoo  Alibaba  magazines  workforce  Martha Nelson  San Francisco  

Other Articles