another two tdp mlas in the way of vivek..?

Two more telangana tdp mlas to join trs

chandrababu naidu, quthbullapur mla, kp vivekananda, telugudesam, telangana tdp leaders, L ramana, mla revanth reddy, telangana, trs, kcr, telangana tdp, telangana tdp mla, madhavaram krishna rao, cm camp office, seri lingampally, t tdp mla gandhi,

if sources are true, another two telangana tdp mlas are going to join tdp soon

తెలంగాణ టీడీపీలో కలవరం.. వివేక్ బాటలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు..?

Posted: 02/09/2016 07:36 PM IST
Two more telangana tdp mlas to join trs

ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లు ఇచ్చిన షాక్ కు గురైన తెలంగాణ టీడీపీకి తాజాగా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. తెలంగాణ టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు అదికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతారన్న సమాచారం వారిని నిద్ర కరువయ్యేలా చేస్తుంది. ముగ్గురు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు త్వరలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం తీసుకోనున్నారన్న వార్త ఓ వైపు సంచలనం రేకెత్తిస్తుండగా, ఇవాళ ఉదయం జరిగిన పరిణామంతో ఇది నిజమేనన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

తెలంగాణలో జరుగుతున్న అన్ని ఎన్నికలలో అదికారిక టీఆర్ఎస్ పార్టీ కారు జోరు కోనసాగుతుండటంతో, విపక్షంలో ఉంటే రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని అనుకున్నారో, ఏమో, మరో ఇద్దరు సనసభ్యులు టీఆర్ఎస్ లోకి జంప్ చేయబోతున్నారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వీరంతా గ్రేటర్ పరిధిలోని వారేనని తెలుస్తున్నప్పటికీ, ఎవరన్నది మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాందీల పేర్లు మాత్రం వినబడుతున్నాయి. ఇదే జరిగితే, జంటనగరాల్లో ఎంఐఎం మినహా మిగతా పార్టీలకు ముందుండి నడిపించే నేతలు కరవవుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  trs  kcr  telangana tdp  telangana tdp mla  prakash goud  seri lingampally  t tdp mla gandhi  

Other Articles