ramana and revanth alleges pressure on defectors

Ruling trs pressuring defectors alleges telangana tdp

chandrababu naidu, quthbullapur mla, kp vivekananda, telugudesam, telangana tdp leaders, L ramana, mla revanth reddy, telangana, trs, kcr, telangana tdp, telangana tdp mla, madhavaram krishna rao, cm camp office

telangana tdp leaders L ramana and mla revanth reddy alleges that TRS has been indulging in encouraging defections from other parties to it by blackmailing.

ప్రలోభాలు, బ్లాక్ మెయిలింగ్ తోనే.. విపక్షాల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి..

Posted: 02/09/2016 07:03 PM IST
Ruling trs pressuring defectors alleges telangana tdp

తెలంగాణ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కెపి వివేకానంద టీడీపీ పార్టీని వీడి అధికారిక పార్టీలో చేరి కారు ప్రయాణం చేస్తున్న తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి తీవ్రస్తాయిలో ద్వజమెత్తారు. తమ ఎమ్మెల్యేల వ్యాపార వ్యవహారాల్లో జోక్యం చేసుకుని వారిని ప్రలోబాలకు గురిచేస్తూ తమ పార్టీలోకి లాక్కుంటుందని వారు అరోపించారు. అప్పటికీ తమ పార్టీ ఎమ్మెల్యేలు వినని పక్షంలో వారిని అనేక రకాలుగా బ్లాక్ మెయిలింగ్ చేసి మరీ తమ పార్టీలో చేరేట్లుగా అధికార పార్టీ ప్రణాళికలు రచిస్తుందని ఆరోపించారు.

తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం లేదని వారు విమర్శించారు. అదికార పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ.. తప్పుడు విదానాలతో బలం పెంచుకునే చర్యలకు పాల్పడుతుందని వారు దుయ్యబట్టారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ టీఆర్ఎస్ పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. మాధవరం కృష్ణారావును స్థలం వివాదంలో భయపెట్టి, ధర్మారెడ్డిని కాంట్రాక్టుల పేరుతో మచ్చిక చేసుకుని, తీగల కృష్ణారెడ్డిని కళాశాలల పేరుతో ఒత్తిడి తెచ్చి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని అన్నారు.

తాజాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ ను అక్రమ కట్టడాల వివాదం, వ్యక్తిగత కుటుంబ తగాదాల నేపథ్యంలో పార్టీలోకి తీసుకెళ్లారని చెప్పారు. ఇలా పార్టీ పిరాయింపులను ప్రోత్సహించుకుంటూ పోతే, కేసీఆర్ కుటుంబంలో ఏదో ఒకరోజు ముసలం పుట్టడం ఖాయమని రేవంత్ స్పష్టం చేశారు. దాంతో భవిష్యత్తులో మీరు కూడా అవే పిరాయింపులతో బలవుతారని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana tdp leaders  L ramana  mla revanth reddy  telangana  trs  kcr  telangana tdp  

Other Articles