day is the day to champaign for GHMC Elections

Day is the day to champaign for ghmc elections

GHMC, GHMC Elections, Poll, Hyderabad, TRS, TDP, Congress, MIM

Today eveing end card for the GHMC Elections champaign. All parties ready to face the poll.

నేటితో ప్రచారానికి తెర

Posted: 01/31/2016 12:12 PM IST
Day is the day to champaign for ghmc elections

అన్ని పార్టీలు తమ శక్తి మేరకు గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్రేటర్ మేయర్ సీటును ఎలాగైనా సొంతం చేసుకోవాలని అన్ని పార్టీలు తహతహలాడుతున్నాయి. అయితే నేటితో ప్రచారానికి తెర పడనుంది. టీఆర్ఎస్, టిడిపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు సిపిఐ, సిపిఎం, లోక్ సత్తా పార్టీలు కూడా బారీగానే ప్రచారాన్ని నిర్వహించాయి. టిఆర్ఎస్ పార్టీని ఎలాగైనా గెలిపించాలని కేసీార్, కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు తదితరులు ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు, లోకేష్, రేవంత్ రెడ్డి, దయాకర్ లాంటి నాయకులు ప్రచారం నిర్వహించారు.

హైదరాబాద్ లో విస్తృత ప్రచారం చేశారు కాంగ్రెస్ నేతలు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడితో పాటు.. పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంతో జనాన్ని కలిసే ప్రయత్నం చేశారు. నేటి సాయంత్రం ప్రచారానికి ఎండ్ కార్డ్ పడనుండటంతో.. ఓటర్లను ఎలాగైనా మచ్చిక చేసుకునే పనిలోపడ్డారు నేతలు. అన్ని పార్టీలు గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా కొన్ని పార్టీలు ఓటర్లను మభ్యపెట్టేందుకు చీరలు, టిఫిన్ బాక్సులులాంటి వాటిని పంచిపెడుతున్నాయి. కాగా నేటి సాయంత్రం నుండి వైన్స్ కూడా బంద్ కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  GHMC Elections  Poll  Hyderabad  TRS  TDP  Congress  MIM  

Other Articles