ISIS warning to UK PM

Isis warning to uk pm

ISIS, ISIS Terrorists, Terrorists, Syria, Paris, Paris Attack

A video released by the terrorist group Islamic State claimed to show the nine Paris attackers in Iraq and Syria, some time before they killed 130 people in the French capital on 13 November 2015.In the video, Isis also threatens an attack on the UK – showing footage of major London sites, as well as David Cameron, the prime minister, and John Bercow, the Speaker of the House of Commons, with crosshairs over their faces. They are shown towards the end of the 17-minute clip, which predominantly focuses on the alleged Paris attackers.

మా కత్తుల లక్ష్యం అంటూ ఐసిస్ తాజా వీడియో

Posted: 01/25/2016 11:41 AM IST
Isis warning to uk pm

నిన్నటి దాకా ప్రపంచానికి వెన్నులో వణుకుపుట్టించిన ఐసిస్ కు నేడు భారత్ కూడా వణుకుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు నగరాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడాలని వేసుకున్న ప్లాన్ ను ఎన్ఐఏ బయటలకు తీసింది. హైదరాబాద్ తో సహా పలు కీలక నగరాల్లో ఐసిస్ ఉగ్రవాదులను, వారికి సహకరిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే రేపటి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. కాగా ఐసిస్ తాజాగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. ఫ్రాన్స్ మీద దాడి చేసి 130 మంది అమాయకుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదుల గురించి ఆ వీడియోలో ఉంది.

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ మీద ఐసిస్ ఉగ్రవాదులు అకస్మాత్తుగా విరుచుకుపడి... 130 అమాయకుల ప్రాణాలను బలతీసుకున్నారు. అయితే ఐసిస్ తరఫున దాడులు చేసిన ఉగ్రవాదుల మీద తాజాగా ఐసిస్ మీడియా కేంద్రం అల్ హయత్  వీడియోను విడుదల చేసింది. అందులో ఐసిస్ చేతికి చిక్కిన బానిసలను నిర్దాక్షిణ్యంగా చంపడం కనిపించింది. ఫ్రెంచ్, అరబ్ భాషల్లో వీడియో సందేశం ఉంది. అందులో బ్రిటన్ ప్రధాని కెమెరూన్ ను చూపిస్తూ మా కత్తుల తర్వాతి లక్ష్యం అంటూ హెచ్చరించారు. ఫ్యారిస్ మీద దాడి చేసిన వారిలో నలుగరు బెల్జియన్లు, ముగ్గురు ఫ్రాన్స్ పౌరులు మరో ఇద్దరెు ఇరాకీలు ఉన్నారని.. వీరంతా సింహాలని వర్ణించారు. యుఎస్ నేతృత్వంలోని  సంకీర్ణ కూటమి దేశాలను వదిలిపెట్టబోమని అందులో హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  ISIS Terrorists  Terrorists  Syria  Paris  Paris Attack  

Other Articles