Cremation records of Netaji released online

Cremation records of netaji released online

Netaji, Netaji Subhash Chandra Bose, Bose, Netaji Dead, Cremation records of Netaji

A UK website set up to catalogue the last days of Subhas Chandra Bose has released the evidence given by a Taiwanese official who claimed to have prepared Netaji's body for cremation after his death in a plane crash in 1945. The testimony, contained in UK Foreign Office file No FC1852/6 and dating back to 1956, is among the last few documents to be released by www.bosefiles.info set up to establish that the Indian freedom fighter died in the crash on the outskirts of an airfield in Tai ..

బోస్ అంత్యక్రియలు అలా జరిగాయట

Posted: 01/22/2016 11:27 AM IST
Cremation records of netaji released online

స్వతంత్ర సమరయోధుడు నేతాజీ మరణం మీద గత కొంత కాలంగా చర్చసాగుతోంది. అయితే తాజాగా అతడి అంత్యక్రియలకు సంబందించిన కొత్త విషయాలు వెలుగులొకి వచ్చాయి. bosefile.info లో నేతాజీ అంత్యక్రియలకు సంబందించిన ఓ సాక్ష్యాన్ని విడుదల చేశారు. నేతాజీ భౌతికకాయానికి 1945 ఆగస్టు 22వ తేదీన తైవాన్ రాజధాని తైపీ నగరంలో ‘ఇచిరో ఒకురా’ అనే పేరు రిజిస్టరు చేసి అంత్యక్రియలు నిర్వహించారు అని ఆ సైట్ వెల్లడించింది. బ్రిటన్ విదేశాంగ కార్యాలయంలో.. ఎఫ్‌సీ1852/6 ఫైల్ నంబరుతో ఉన్న తైవాన్ అధికారి సాక్ష్యం పత్రాన్ని తాజాగా వెబ్‌సైట్‌లో ప్రచురించింది.

1956 సంవత్సరానికి చెందిన ఈ పత్రం ప్రకారం.. 1945 ఆగస్టు 22వ తేదీన బోస్ అంత్యక్రియలు జరిగాయని.. నాడు తైపీ నగరంలో అంత్యక్రియల అనుమతులను జారీ చేసే అధికారి టాన్ టి-టి సాక్ష్యం ఇచ్చారు. అయితే.. అంతకుముందు రోజు అంటే 1945 ఆగస్టు 21వ తేదీన ఇచిరో ఒకురా అనే పేరుతో ఉన్న మరణ ధ్రువీకరణ పత్రాన్ని.. బోస్ భౌతికకాయంతో పాటు వచ్చిన జపాన్ సైనికాధికారి ఒకరు తైపీ అధికారులకు సమర్పించారు. మరుసటి రోజు ఆగస్టు 22వ తేదీన.. భౌతికకాయంతో వచ్చిన సదరు జపాన్ అధికారి.. అది భారత నాయకుడు (కమాండర్) బోస్‌దని, ఆయన ఒక ముఖ్యమైన పని మీద టోక్యో వెళుతుండగా విమాన ప్రమాదానికి గురై గాయపడ్డట్లు చెప్పారని టి-టి వాంగ్మూలం ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సైనిక మృతుల బంధువులు అందుబాటులో లేనపుడు సైనిక ఆస్పత్రి ఇచ్చే మరణ ధ్రువీకరణ పత్రం ఆధారంగా అంత్యక్రియలకు అనుమతి ఇవ్వటం జరిగేదని తైవాన్ ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Netaji  Netaji Subhash Chandra Bose  Bose  Netaji Dead  Cremation records of Netaji  

Other Articles