Hyderabad student's suicide: This isn't a Dalit vs non-Dalit issue, says Smriti Irani

Rohith vemula s death not a matter of caste battle smriti irani

ABVP, Ambedkar Students Association, Bandaru Dattatreya, BJP, Hanumantha Rao, HRD Ministry, Hyderabad University, Rohith Vemula, Smriti Irani

Three days after PhD student Rohith Vemula was found hanging in a hostel room in the HCU, HRD Minister Smriti Irani sought to downplay the caste angle to the incident, terming it a 'malicious attempt to ignite passions.'

రోహిత్ వేముల ఘటన దళిత దళితేర సమస్య కాదు: స్మృతి ఇరానీ

Posted: 01/20/2016 09:28 PM IST
Rohith vemula s death not a matter of caste battle smriti irani

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనను దళిత, దళిత వ్యతిరేక ఘటనగా చిత్రీకరించవద్దని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. రోహిత్ ఆత్మహత్య తరువాత ఐదు రోజులకు స్పందించిన అమె ఈ ఘటనపై వివరణ ఇస్తూ రోహిత్ మృతి విచారకరమంటూ అతని కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ అంశంలో కొంతమంది వాస్తవాలు వక్రీకరించి రెచ్చగొడుతున్నారని స్మృతి వ్యాఖ్యానించారు.  రోహిత్ ఆత్మహత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందన్నారు. నిజ నిర్ధారణ కమిటీ నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్సీయూ ఘటనలో కేంద్రం జోక్యం లేదని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.

కాగా, రోహిత్ సూసైడ్ నోట్లో ఎవరిపైనా ఆరోపణలు చేయలేదని అమె తెలిపారు. సూసైడ్ నోట్లో ఎవరి పేర్లు ప్రస్తావించలేదన్నారు. పీహెచ్డీ విద్యార్థుల సస్పెన్షన్పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు కూడా నిరాకరించిన విషయాన్ని స్మృతి ఇరానీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.  విద్యార్థుల సస్పెన్షన్ కు సంబంధించి పాలకమండలి ఎప్పటికప్పుడు దళిత ప్రొఫెసర్లకు సమాచారం అందించిందని ఆమె తెలిపారు. విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలని చెప్పింది దళిత వార్డెనే అని స్మృతి చెప్పారు. అలాగే  పాలకమండలి సభ్యులందరూ గత ప్రభుత్వంలో నామినేట్ చేసినవారేనని అన్నారు. అలాగే రోహిత్ కుల వివాదంపై విచారణ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.

హెచ్‌సీయూలో విద్యార్థుల ఆత్మహత్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రానికి కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు కూడా గతంలో లేఖ రాసారని ప్రస్తావించారు. దురుద్దేశంతో కూడిన ప్రచారం జరుగుతోందని, రోహిత్ మృతికి కుల రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారని స్మృతీ ఇరానీ విమర్శించారు. రోహిత్ సూసైడ్‌ నోట్‌ నా వద్ద ఉందని, దీనిలో విశ్వవిద్యాలయ అధికారుల పేరు లేదని, జాతీయ పార్టీల నాయకుల పేర్లు లేవని, ఎంపీ పేరు కూడా లేదని ఆమె అన్నారు. హెచ్‌సీయూ పాలక మండలని ఈ ప్రభుత్వం నియమించలేదని, సభ్యులందరినీ మునుపటి ప్రభుత్వమే నియమించిందని స్మృతీ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohith Vemula  Suicide  HCU  Smriti Irani  Union HRD Minister  

Other Articles