31 killed in terror attack on Pakistan university campus

Pakistan university attack at least 30 dead as gunmen storm bacha khan campus

Pakistan University Attack,Bacha Khan University Attack, Charsadda University, northwestern Khyber Pakhtunkhwa province, Peshawar, Afghan-pakistan boarder, Khan Abdul Ghaffar Khan death anniversary, popular ethnic Pashtun independence activist, Tehreek-e-Taliban Pakistani leader Umar Mansoor, TTP spokesman Muhammad Khorasani denies

The Pakistani Taliban first took and then denied responsibility for this morning's deadly assault on a university in volatile northwestern Pakistan, in which 31 people died

పాక్ లో మారణహోమం.. వర్సిటీలోకి చొరబడ్డి కాల్పులతో తెగబడ్డ ఉగ్రవాదులు.

Posted: 01/20/2016 05:24 PM IST
Pakistan university attack at least 30 dead as gunmen storm bacha khan campus

పాకిస్తాన్‌లోని పెషావర్‌ నగరంలోని బచాఖాన్‌ విశ్వవిద్యాలయంలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. యూనివర్సిటీ ఆవరణలోకి చొరబడిన ఉగ్రవాదలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. బాంబులు కూడా పేల్చారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 70కి పెరిగింది. పఠాన్‌కోట్‌ తరహాలోనే దాడికి పాల్పడ్డారు. ఆరుగురు ఉగ్రవాదులను పాక్‌ సైనికులు హతమార్చారు. మరికొంత మంది వర్సిటీలోనే ఉంటూ దాడులు చేస్తున్నారు.

దాడి సమయంలో యూనివర్సిటీలో 3 వేల మంది విద్యార్థులు, 600 మంది అతిథిలు ఉన్నారని కాగా, ఉగ్రదాడిలో అనేక మంది చనిపోయారని,. పలువురికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. ప్రాణ నష్టం తగ్గించేందుకు పాక్‌ సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది. ముందుగా హాస్టల్స్‌ నుంచి విద్యార్థులను ఖాళీ చేయించింది. 20 అంబులెన్స్‌లను వెంటనే రప్పించారు. దాడి సమయంలో భయపడ్డ విదార్థులు, ప్రొఫెసర్లు పరుగులు తీశారు.

ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుకు సమీపంలో నెలకొన్న బచాఖాన్‌ యూనివర్సిటీలో కవి సమ్మేళనం జరుగుతున్న సమాచారాన్ని తెలుసుకున్న ఉగ్రవాదులు ఏకే 47 తుపాకులలో పాటు భారీగా మందుగుండు సామాగ్రిని సైతం తమ వెంట తెచ్చుకుని కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల ప్రాబల్యం అధికంగా వున్న అఫ్ఘన్-పాక్ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమానికి నామమాత్రపు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. దీనిని అదునుగా తీసుకున్న తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ ఉగ్రవాదులు 10 మంది అకస్మికంగా విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి.. కాల్పులకు తెగబడినట్లుగా సమాచారం. కాల్పులతో పాటు బాంబులు విసురుతూ యూనివర్సిటీ విద్యార్ధులను, ప్రోఫెసర్లను, అతిధులను భయకంపితులను చేశారు.

కాగా, ఇప్పటి వరకు 31 మృతదేహాలను మార్చురికి తరలించారు. ఇంకా వర్సిటీలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. వీరు వర్సిటీలోని బాయ్స్‌ హాస్టలో దాక్కుని కాల్పులు జరుపుతున్నట్లుగా తెలియవచ్చింది. ఉగ్రవాదులు విద్యార్థులు, ప్రొఫెసర్లనే టార్గెట్‌ చేసుకున్నట్లుగా తెలియవచ్చింది. ఉగ్రవాదులు అందరూ 18-25 ఏళ్ల వయస్సులోపు వారేనని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉగ్రవాదులందరూ ఆర్మీ దుస్తుల్లో యూనివర్సిటీలోకి ప్రవేశించి దాడులకు పాల్పడినట్లు తెలుస్తుంది. కాగా, ఈ దాడికి తామే బాధ్యులమంటూ తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ తొలుత ప్రకటించి ఆ తరువాత తాము కాదని పేర్కోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan University  Terror Attack  Bacha Khan University Attack  TTP  

Other Articles