district co-operative officials issues notices to agri gold

Agri gold another scam exposed

agrigold, high court, Agrigold Scam, Agrigold parivar mutual deposits scam, vijayawada, district co-operative officials issues notices to agri gold, agri gold agents face investigation, agri gold another scam exposed, Agri Gold Parivaar mutually aided co-operative credit society,

New Scam of Agri Gold has been exposed. This time some of the agents have been targeted by Agri Gold in the name of Parivaar mutually aided co-operative credit society.

తవ్విన కొద్దీ బయపడుతున్న అగ్రి గోల్డ్ కుంభకోణాలు.. పరివార్ పేరుతో కోట్లకు కుచ్చుటోపి

Posted: 01/17/2016 02:42 PM IST
Agri gold another scam exposed

నమ్మితేనే కదా మోసం చేసేది అన్న చందాన్ని బాగానే వంటబట్టించుకున్న అగ్రిగోల్డ్ సంస్థ తమను నమ్మిన వినియోగదారులను నట్టేట ముంచింది. అయితే గత కొన్ని ఏళ్లుగా తమకు న్యాయం చేయాలని ధర్నాలు, ర్యాలీలతో అందోళన చేసిన డిఫాజిటర్లు చివరకు హైకోర్టును అశ్రయించడంతో.. వారికి డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు అంగీకరించింది. ఇదిలా వుండగా తవ్విన కొద్దీ అగ్రి గోల్డ్ సంస్థ కుంభకోణాలు భయటపడుతున్నాయి. తాజాగా అగ్రిగోల్డ్ సంస్థ చేసిన మరో కుంభకోణం వెలుగు చూసింది. అగ్రిగోల్డ్ పరివార్ మ్యూచువల్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో రూ.వందల కోట్లు వసూలు చేసింది. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తామంటూ డిపాజిట్లు సేకరించింది. అయితే వాటి చెల్లింపులో కాలయాపన చేయడం, అక్రమంగా డిఫాజిల్లను సేకరించడం వంటి చర్యలపై జిల్లా కో అపరేటివ్ అధికారులు దృష్టి సారించారు.

అగ్రిగోల్డ్ ఖాతాదారుల ఫిర్యాదుపై జిల్లా కోఅపరేటివ్ అధికారులు ఈ నెల 19న విచారణ జరపనున్నారు. ఈ మేరకు అగ్రిగోల్డ్ ఏజెంట్లకు కూడా డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారి ...అగ్రిగోల్డ్ సంస్థకు నోటీసులు జారీ చేశారు. కాగా అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడులు పెట్టి సుమారు 40 లక్షల మంది నష్టపోయిన సంగతి తెలిసిందే. వీరిలో 32 లక్షల మంది డిపాజిటర్లు కాగా 8 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహించి దివాళా తీసింది. ప్రస్తుతం సంస్థకు చెందిన ఆస్తులను వేలం వేసి బాధితులకు ఊరట కల్పించే నిర్ణయంలో భాగంగా ఈ త్రిసభ్య కమిటీని కోర్టు నియమించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : agrigold  high court  Agrigold Scam  Agrigold parivar mutual deposits scam  

Other Articles