Bihar's favourite samosa and kachori to get costlier

Samosa kachori now luxury items in bihar

Nitish Kumar, 13.5 per cent tax, luxury items, bihar, samosa, kachauri, kachori, Bihar, Samosa tax, luxury tax, Nitish Kumar, Lalu Prasad, prohibition, Value Added Tax, VAT, revenue

Sweets costing more than Rs500 a kg, salted snacks among items to attract 13.5% value added tax in the state

కాస్ట్లీగా మారిన సమోసా. కచోరీ.. సామాన్యులకు అందని ద్రాక్ష

Posted: 01/14/2016 09:15 AM IST
Samosa kachori now luxury items in bihar

కప్పు చాయ్‌, ఒక సమోసా తింటే కడుపు నిండిన సంతృప్తి చెందే సామాన్యుడికి. రానురాను అవి కూడా అందని ద్రాక్షాగానే మారుతున్నాయి. సమోసా, కచోరిలు కూడా ఖరీదైన ఆహార పదార్థాల జాబితాలో చేరిపోవడంతో.. వాటితో కడుపునింపుకునే సామాన్యులకు ఇప్పుడా పరిస్థితి కూడా లేదు. ఇక గాలి పీల్చి, నీరు తాగి అకలి దప్పికలను తీర్చుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రభుత్వాలు సామాన్య ప్రజల కోసమే అన్న నానుడి పోయి ప్రభుత్వాలు కేవలం పన్నులు విధించడం కోసమే.. సామాన్యులకు ఏ వస్తువును, తినుబండారాలను అందుబాటులోకి రానీయకుండా చేయడానికే అన్నట్లుగా మారుతున్నాయి

తాజాగా బిహార్‌లోని నితీశ్‌కుమార్ ప్రభుత్వం సమోసా, కచోరీలను విలాస వస్తువుల జాబితాలో చేర్చి.. వాటిపై ఏకంగా 13.5శాతం పన్ను విధించింది అక్కడి ప్రభుత్వం. అభివృద్ధి అజెండాతో ముందుకుసాగుతున్న నితీశ్‌ సర్కార్‌ కు హ్యాట్రిక్ విజయాన్ని అందించిన ప్రజలకు విజయోత్సవ కానుకను అందించారన్న వ్యంగ్యవిమర్శలు కూడా వినబడుతున్నాయి. రాష్ట్రాభివృద్ధి కోసం తగిన నిధులను పన్నుల రూపంలో సమకూర్చుకోవాలని తాజాగా నిర్ణయించిన నితీష్ సర్కార్ ఏకంగా సామాన్యుల తినుబండారాలపై పన్నుపోటు విధించింది. ఇందులో భాగంగా విలాస వస్తువులపై 13.5 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది.

కిలోకు రూ. 500 కన్నా అధికంగా ధర కలిగిన మిఠాయిలు, దోమల్ని నిరోధించే మస్కిటో కాయిల్స్‌ వంటివాటిని ఈ విలాస వస్తువుల జాబితాలో చేర్చింది. సీఎం నితీశ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిఠాయిలతోపాటు సాల్టీ ఆహార పదార్థాలైన సమోసా, కచోరీలపైనా 13.5 శాతం పన్ను విధిస్తున్నామని కేబినెట్ కోఆర్డినేషన్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రజేశ్ మెహోత్రా తెలిపారు. అదేవిధంగా అన్ని రకాల యూపీఎస్‌ వస్తువులపైనా ఈ విలాస పన్ను ఉంటుందని, ఇసుక, సౌందర్య సాధన ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, తలనూనె వంటివాటిపై కూడా 13.5శాతం పన్ను విధించనున్నామని ఆయన చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  13.5 per cent tax  luxury items  bihar  samosa  kachori  

Other Articles