PM Modi's 'Chai' With Nawaz Sharif Cost us 7 Martyrs

Pm modi s chai with nawaz sharif cost us 7 martyrs

Modi, Shivasena, Samna, Pakistan, ISI, Pathankot, Punjab, Airbase, Shariff, chai with Shariff

Expressing grave concern over the Pathankot terror attack, the Shiv Sena on Tuesday alleged that Prime Minister Narendra Modi’s ‘chai’ (tea) with his Pakistani counterpart Nawaz Sharif cost the nation seven martyrs. Launching a frontal attack on Prime Minister Modi, the Shiv Sena asked the former to introspect the security situation in the country post the Pathankot attack.

టీ కోసం ఏడుగురు సైనికుల ప్రాణాలు బలి

Posted: 01/05/2016 01:33 PM IST
Pm modi s chai with nawaz sharif cost us 7 martyrs

భారత్ మీద పాకిస్థాన్ మరోసారి కుట్రకు పాల్పడింది. భారత్ వైమానిక దళానికి ఎంతో కీలకమైన పఠాన్ కోట్ లోని ఎయిర్ బేస్ మీద ఉగ్రవాదులు చొరబడిదాడులకు పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో ఏడుగురు సైనికులు మరణించగా దాడులకు పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అయితే దేశవ్యాప్తంగా దీని మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పాకిస్థాన్ మరోసారి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే మోదీ మాత్రం పాకిస్థాన్ ప్రదానితో కలిసి టీ తాగుతుంటే.. చర్చలకు ఆహ్వానిస్తుంటే పాకిస్థాన్ సైడ్ నుండి మాత్రం ఇలా ఉగ్రవాదులను భారత్ మీదకు ఉసిగొల్పుతోందని శివసేన తనదైన స్టైల్లో చురకలంటించింది.

బిజెపి మిత్రపక్ష శివసేన మరోసారి మోదీ మీద విమర్శలు గుప్పించింది. శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో మోదీ మీద, పాకిస్థాన్ వైఖరి మీద విమర్శలు గుప్పించింది. మోదీ షరీఫ్ తో కలిసి టీ తాగితే.. మన సైనిక వీరులు ఏడుగురు ప్రాణాలు కోల్సోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే పాకిస్థాన్ ఎన్నటికి భారత్ కు నమ్మదగిన, మిత్ర దేశం కాదని తెలిపింది. అలాగే భారత సరిహద్దులు పటిష్టంగా లేవని కూడా శివసేన తన పత్రికలో పేర్కొంది. భారత్ తో శాంతి చర్చలు కొనసాగాలి అంటే తక్షణం జైష్ ఏ మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ను భారత్ కు అప్పగించాలని కూడా పాకిస్థాన్ ను శివసేన డిమాండ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Shivasena  Samna  Pakistan  ISI  Pathankot  Punjab  Airbase  Shariff  chai with Shariff  

Other Articles