auto driver suspected in warngal gilrs mysterious death

Auto drivers role suspected in warangal girls twin murder cas

auto drivers role suspected in warangal girls twin murder case, parvathgiri mandal murder case,naryanapurm resident ramu, warangal district murder case, ramu auto driver, suspected in warangal shedule tribe girls twin murder case, Ramu, The mysterious death, Ramu, Twin murder case, mysterious death, Priyanka, Bhoomika

parvathgiri mandal naryanapurm resident of warangal district, ramu the auto driver is suspected in warangal shedule tribe girls twin murder case

వరంగల్ గిరిజన బాలికలపై దారుణానికి ఒడిగట్టింది అటో డ్రైవరేనా..?

Posted: 12/31/2015 04:38 PM IST
Auto drivers role suspected in warangal girls twin murder cas

వరంగల్ జిల్లాలో కంబాలకుంట తండా బాలికలు బానోత్ భూమిక, బానోత్ ప్రియాంక మృతి వెనుక మిస్టరీ ఇంకా వీడడం లేదు. కాగా ఈ హత్యల వెనుక ఓ ఆటోడ్రైవర్‌కు ప్రమేయముందని అనుమానాలు వక్యమవుతున్నాయి. ఈ కేసులో పోలీసుల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హతుల తల్లిదండ్రులు, బంధువులు అరోపిస్తున్నారు. పర్వత్ పూర్ మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జేరిపోతుల రాము నవంబర్ 10న రోజువారీ ఫైనాన్స్‌లో రూ.15 వేలు రుణం తీసుకున్నాడు.

అంతకు ముందురోజైన దీపావళినాడు సెలవు ఉండడంతో కోసం ప్రియాంక ఇంటికి వచ్చింది.  రాము, ప్రియూంక కలిసి నవంబర్ 22 వరకు రెండు, మూడు సార్లు నెక్కొండ సినిమా థియేటర్‌కు వచ్చినట్లు ఓ విద్యార్థిని చెప్పడం అనుమానాలకు బలాన్నిస్తోంది. 23న వారిద్దరు మరోసారి  నెక్కొండలో కలుసుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా నవంబర్ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకు రూ.150 చొప్పున గిరిగిరి డబ్బులు చెల్లించిన రాము 23వ తేదీ నుంచి కనిపించకుండా పోయూడు. దీన్ని బట్టి రాము ప్రియూంకతో ఉన్నట్లు ఆటో డ్రైవర్లు అనుమానిస్తున్నారు.

23న సినిమాకు వెళ్లిన వారిలో రాము కూడా ఉన్నట్లు సమాచారం. భూమిక కోసం రాముతో కలిసి మూడు వెంకన్న అనే వ్యక్తి వచ్చేవాడని అదే హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థిని చెప్పడం గమనార్హం. కాగా 10 నెలల క్రితమే రాముకు పెళ్లి కాగా రెండు నెలలకే భార్యతో గొడవపెట్టుకుని కట్నం కావాలని ఆమెను పుట్టింటికి పంపినట్లు స్థానికులు తెలిపారు. రోజూ అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చేవాడని వెల్లడించారు. నవంబర్ 25న ప్రియాంక, భూమిక తప్పిపోయినట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అప్పటి వరకు రాము, వెంకన్న కూడా ఊర్లో లేరు. నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రామును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా ప్రియాంకతో కలిసి మూడుసార్లు సిని మాకు వెళ్లిన విషయూన్ని వెల్లడించినట్లు తెలిసింది. అయితే ఆమె ఎక్కడ ఉందో తెలియదని చెప్పడంతో వదిలేశారు. అప్పటి నుంచి అతడు స్వగ్రామాన్ని వదిలేసి వేరొక ఊర్లో భార్యతో కలిసి ఉంటున్నట్లు సమాచారం. కాగా, పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉంటే నిందితులు ఎప్పుడో దొరికేవారన్న అరోపణలు వినబడుతున్నాయి. ప్రియాంక, భూమిక తల్లిదండ్రులు మాత్రం పోలీసులు ఏ మాత్రం సహకరించలేదని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ములు గు, నల్లబెల్లి, పర్వతగిరి పోలీసులు ఎవరికి వారే దర్యాప్తులో నిర్లక్ష్యం ప్రదర్శించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramu  Twin murder case  mysterious death  Priyanka  Bhoomika  

Other Articles