Mohammed Azharuddin rubbishes third marriage rumours

Azharuddin denies third marriage with shannon marie

Mohammed Azharuddin, marriage, third, Mohammed Azharuddin, match fixing, Shannon Marie, twitter, marriage, shannon, sangeet bijlani, emran hashmi, biopic

Former Indian cricketer Mohammed Azharuddin on Sunday denied reports that he has married for a third time.

అవన్నీ శుద్ద అబద్దాలు.. సత్యదూరమైన అవాస్తవాలు..

Posted: 12/21/2015 02:45 PM IST
Azharuddin denies third marriage with shannon marie

తాను మూడో విభాహం చేసుకున్నట్లు వస్తున్న వదంతులకు టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజహరుద్దీన్ కోట్టిపారేశారు.. ఈ క్రికెటర్ మరో వివాహం చేసుకున్నాడని ఇటీవల వదంతులు షికార్లు చేస్తున్నాయి. కొన్ని మీడియాలలో వార్తలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విసుగుచెందిన అజహరుద్దీన్ ఈ విషయంపై ట్విట్టర్ పోస్ట్ ద్వారా సమాధానమిచ్చాడు. స్నేహితురాలు షాన్నన్ మేరీని ఈ క్రికెటర్ పెళ్లి చేసుకున్నాడని ఊహాగనాలు వినిపించగా, తాను మూడో వివాహం చేసుకోలేదని ఆ వార్తలను ఖండించాడు. ఇదిలాఉండగా, తన డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించడానికి ముంబైకి వెళ్లినపుడు షాన్నెన్ ను ఆయన తన భార్యగా పరిచయం చేశాడన్నది వదంతులకు ఊతమిచ్చింది.

ఇటీవల జరుగుతున్న ఐటీపీఎల్ లీగ్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఏసెస్, ఫిలిప్పైన్స్ మ్యాచ్ వీక్షించడానికి గర్ల్ ఫ్రెండ్ షాన్నెన్తో కలిసి రావడం కూడా పుకార్లకు ఊతం ఇచ్చింది. టీమిండియా విజయవంతమైన క్రికెట్ కెప్టెన్లలో ఒకడుగా పేరుగాంచిన అజహర్ మొదటి భార్య నౌరీన్తో 1996లో విడాకులు తీసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. కాగా, రెండో భార్య సంగీతా బిజ్లానీ, అజహర్ 2010లో విడిపోయారు. షాన్నెన్తో సన్నిహితంగా ఉండటంతో తాను వివాహం చేసుకున్నట్లు అందరు భావించినట్లు చెప్పాడు. అయితే తాను మూడో వివాహం చేసుకున్నాడన్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ తప్పుడు కథనాలు అని మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కొట్టిపారేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles