Pawan Kalyan son Akira wrote letter to his mother Renu desai

Pawan kalyan son akira wrote letter to his mother renu desai

Pawan Kalyan, Renu Desai, Pawan Kalyan Son, Pawan kalyan Son Akira nandan, Akira nandan, Renu Desai Tweets, pawan Kalyan Latest News, pawan kalyan updates

Pawan Kalyan son Akira wrote letter to his mother Renu desai. On Renu Desai birth day occassion Akira nandan wrote a letter, in that he wish his mother and express his feelings on mother.

ప్రేమతో తల్లికి పవన్ కళ్యాణ్ కొడుకు లెటర్

Posted: 12/04/2015 06:47 PM IST
Pawan kalyan son akira wrote letter to his mother renu desai

పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ తన తల్లి రేణుదేశాయ్ కు ఓ లెటర్ రాశాడు. తన తల్లికి పుట్టిన రోజు శుబాకాంక్షలు తెలుపుతూ తన ప్రేమను లెటర్ లో అక్షరాలుగా మలిచి శుభాకాంక్షలు తెలిపాడు. రేణు దేశాయ్ పుట్టిన రోజు సందర్భంగా ఎంతో మంది ఆమెకు పుట్టిన రోజు శుబాకాంక్షలు తెలిపినా కానీ తన కొడుకు పంపిన లెటర్ ఎంతో ఆనందాన్ని కలిగించిందని సంతోషిస్తోంది. పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ లకు అకిరా నందన్, కూతురు ఆద్య ఉన్నారు. తన తల్లి మీద ప్రేమను అకిరా నందన్ ఇలా లెటర్ లో వ్యక్తపరిచాడని.. ఆ లెటర్ ను రేణుదేశాయ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. లెటర్ తో పాటు ఫ్రూట్ కేక్ ను తయారుచేసి తన తల్లికి పంపించాడు అకిర్ నందన్.

తన తల్లి రేణుదేశాయ్ కు రాసిన లెటర్ లో తన తల్లి మీద ఉన్న గౌరవాన్ని, ప్రేమను అకిరా నందన్ వెల్లడించాడు. లేఖ సారాంశం ఈ విధంగా ఉంది. నువ్వు లేకపోతే నేను ఈ లోకంలోకి వచ్చి ఉండేవాడిని కాదు. నువ్వే లేకపోతే ప్రేమ, దయ, స్నేహం అనే వాటికి అర్థం తెలిసేది కాదు. నువ్వు ఓ గొప్ప అమ్మవి అని చెబుతూ లేఖలో వ్యక్తపరిచాడు. కుమారుడు తనపై చూపిన ఈ అవ్యాజ్య ప్రేమకు పొంగిపోయిన రేణుదేశాయ్ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఎంత మంది తనకు శుభాకాంక్షలు చెప్పినా కానీ. ఓ తల్లికి తన పిల్లలు చెప్పే నాలుగు ముక్కలు ఎంతో స్పెషల్. రేణుదేశాయ్ కి కూడా అకిరా నందన్ లెటర్ బర్త్ డేను కలర్ ఫుల్ గా చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles