Dawood Ibrahim's aide nabbed by Indian intelligence agencies at Indo-Nepal border

Dawood ibrahim s men arrested in nepal

Dawood Ibrahim, Indian intelligence agencies, Indo-Nepal border, underworld don, IB, RAW, intelligence bureau, abid patel, Gujarat, Bharuch, Javed Chikna, Shirish Bangali, Pragnesh Mistry

big breakthrough for Indian intelligence agencies, the IB and R&AW have nabbed an aide of underworld don Dawood Ibrahim at the Indo-Nepal border.

దావూద్ ముఖ్య అనుచరుడు అబిద్ పటేల్ అరెస్ట్

Posted: 12/03/2015 11:21 AM IST
Dawood ibrahim s men arrested in nepal

భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో వున్న టెర్రరిస్ట్, పాకిస్తాన్ లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్, దావూద్ ఇబ్రహీంకు మరో దెబ్బ తగిలింది. ఇటీవల ఆయన వైరివర్గంగా ముద్రపడిన చోటా రాజన్ పట్టుబడిన నేపథ్యంలో ప్రస్తుతం దావూద్ ముఖ్య అనుచరుడొకడు పోలీసులకు చిక్కిపోయాడు. భారత్-నేపాల్ సరిహద్దు వద్ద పక్కా సమాచారంతో మాటు వేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చి అండ్ అనాలసిప్ వింగ్ (రా) అధికారులు దావూద్ కీలక అనుచరుడు అబిద్ పటేల్ ను పట్టేశారు. అతడ్ని అదుపులోకి తీసుకుని దావూద్ సంబంధించిన పలు వివరాలపై సమాచారాన్ని రాబట్టనున్నారు.

గుజరాత్ లోని భరూచ్ జిల్లాలో ఇటీవల జరిగిన ఇద్దరు బీజేపీ నేతల హత్య కేసులో ఇతడు ప్రధాన నిందితుడు. ఈ హత్యల సమయం నుంచి అబిద్ పై నిఘా వేసిన ఐబీ, రా అధికారులు నిన్న అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. దావూద్ ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందిన జావెద్ చిక్నాకు అబిద్ స్వయానా సోదరుడట. దావూద్ కు సంబంధించిన వ్యవహారాలపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న అబిద్ ను విచారించడం ద్వారా అండర్ వరల్డ్ డాన్ కు సంబంధించిన మరింత కీలక సమాచారం లభ్యం కానుందని ఐబీ అధికారులు భావిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dawood Ibrahim  Indian intelligence agencies  Indo-Nepal border  underworld don  IB  RAW  

Other Articles