Real boom sustains in hyderabad, land prices breaks record

Land price in hyderabad breaks all records

Real estate in Hyderabad, Aurobindo Pharma, Raidurgam, Gachibowli, Naya Infra, Saimed Labs, elangana State Industrial Infrastructure Corporation, Manikonda, Kokapet

Breaking all records, an acre of land in Hyderabad has fetched Rs.29.28 crore to the Telangana government in an e-auction conducted

హైదరాబాద్ లో ‘రియల్’ భూం..భూం.. షకలక..

Posted: 11/26/2015 10:42 AM IST
Land price in hyderabad breaks all records

హైదరాబాద్ లో రియల్‌ ‘భూం’ పడిపోతుందన్న అంధోళన గత రెండున్నర ఏళ్లుగా రియల్టర్లలో నెలకోనగా.. అలాందేమీ లేదని తాజాగా నిర్వహించిన ఈ వేలం రుజువు చేసింది. ఒకప్పుడు రెక్కలు విచ్చుకున్న రియల్‌ భూం ఏ మాత్రమూ తగ్గలేదని బుధవారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భూముల ఈ-వేలంతో తేలడంతో రియల్టర్ల పంట పండుతోంది. ఇక హైదరాబాద్ లో రియల్ భూం భూమ్ భూమ్ షకలక అని గంతులేస్తుంది. రాయదుర్గం తన దర్పాన్ని చూపించింది... మణికొండ మరోసారి మనీకొండ అయింది... కోకాపేట కాసులపేటే అని నిరూపించింది. హైదరాబాద్‌లో మునుపెన్నడూ లేనివిధంగా భూములకు రికార్డుస్థాయి ధర పలికింది.

భూముల్ని అమ్మి ఖజానాను నింపుకోవాలని భావించిన తెలంగాణ ప్రభుత్వానికి.. ‘ఈ’-వేలంలో రూ.400 కోట్ల సొమ్ము సమకూరింది. రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్‌ఐఐసీ గతనెల 30న ఇచ్చిన ఈ టెండర్ కమ్ ఈ వేలం ప్రకటన ఆధారంగా క్రితం రోజు నిర్వహించిన ఈ వేలంలో.. రాయదుర్గంలో రికార్డు ధర నమోదైంది. ఇక్కడ ఎకరాకు రూ. 29.28 కోట్లు పెట్టి అరబిందోఫార్మా మొత్తం 5 ఎకరాలు కొనుగోలు చేసింది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు ఇదే రికార్డు స్థాయి ధర. అరబిందో కంపెనీయే రాయదుర్గంలోనే 3.65 ఎకరాల మరో బిట్‌ను ఎకరాకు రూ. 24.88 కోట్లకు కొనుగోలు చేసింది.

రాయదుర్గంలో గజం ధర రూ.60,495 పలుకగా,  కనిష్ఠంగా కోకాపేటలో రూ.12,500 పలికింది. మణికొండలో గజం రూ.25 వేలకు అమ్ముడైంది. ప్రముఖ సంస్థలు అత్యధిక ధరలు చెల్లించి భూములను సొంతం చేసుకున్నాయి. ఈ ఈ-వేలంలో సుమారు రూ.400 కోట్ల ఆదాయంతో ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన వేలంలో వచ్చిన ఆదాయ రికార్డులను బ్రేక్‌ చేసింది. అప్పుడు రాయదుర్గంలో ఒక్కో ఎకరా ధర సగటున రూ.18 కోట్లు పలుకగా.. ఇప్పుడు అదే ప్రాంతంలో రూ.29 కోట్లు పలికింది.

అరబిందో ఫార్మ తరువాత, అదే రాయదుర్గంలో నయా ఇన్‌ఫ్రా సంస్థ ఎకరాకు రూ.24.20 కోట్లు, సైమెడ్‌ ల్యాబ్స్‌ రూ.22.02 కోట్లు వెచ్చించింది. ఇక, అత్యల్పంగా కోకాపేటలో గ్లాండ్‌ సెల్యులోజ్‌ అనే సంస్థ ఎకరాకు రూ.6.05 లక్షలు చెల్లించింది. ఇక మణికొండ, కోకాపేట ప్రాంతాల్లో నివాస గృహాల నిర్మాణం కోసం ఉదే ్ధశించిన భూముల విక్రయంలోనూ కొత్త రికార్డులు నమోదయ్యాయి. మణికొండలో ఎర్త్‌పేవర్స్‌లో కంపెనీ ఎకరానికి రూ. 12.63 కోట్ల చొప్పున, కోకాపేటలో గ్లాండ్ సెల్యులోజ్ కంపెనీ ఎకరాకు రూ. 6.5 కోట్ల చొప్పున భూములను కొనుగోలు చేశాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Real estate  Hyderabad  Telangana  land prices  

Other Articles