Indonesian airline | compensation for flight delay | Bali island | Lambertus Maengkom | co-pilot | air hostess

Pilot grounded for offering hostess as compensation for delay

Lion Air pilots, Indonesian airline, compensation for flight delay, Bali island, Lambertus Maengkom, co-pilot, air hostess as compensation for a delay, transport ministry, Java island, Lion Air general affairs director, Edward Sirait, investigation on copilot

An Indonesian airline has grounded a pilot after he allegedly offered an air hostess to passengers as compensation for a delay on a flight.

ఎయిర్ హోస్టెస్‌ని వాడుకోండి... కోపైలెట్ ఆఫర్..| మండిపడ్డ ప్రయాణికులు

Posted: 11/21/2015 11:53 AM IST
Pilot grounded for offering hostess as compensation for delay

ఇండోనేషియాలోని బాలీ ద్వీపాలో గల జావా ద్వీపం నుంచి నిర్థిష్ట సమయానికి బయలు దేరాల్సిన విమానం చాలా ఆలస్యంగా బయలు దేరింది. దీంతో ఆ విమానంలో ప్రయాణిం చేస్తున్న ప్రయాణికులందరూ అప్పటికే పైలెట్, సహా విమానసిబ్బంది అందరిపై పీకల్లోతు కోపంతో వున్నారు. ప్రయాణికులను సరదాగా ఆటపట్టించి వారి కోపాన్ని తగ్గిద్దామనుకున్న కో పైలెట్.. వారికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఆ బంఫర్ ఆఫర్ కాస్తా రివర్స్ కావడంతో.. ఎక్కడ దోరుకుతాడా..? చితకొట్టేద్దామన్నంత కోపంతో విమానం లాండ్ కాగానే పరుగులు తీశారు ప్రయాణికులు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటనేగా..?

విమానం ఆలస్యమైనందుకు ఆగ్రహించవద్దని, తమ విమానంలో విడాకులు తీసుకున్న ఎయిర్ హోస్టెస్‌ వుందని ఆలస్యానికి పరిహారం కింద అమెను వాడుకోమని ప్రయాణికులకు దారుణమైన ఆఫర్ చేశాడో కో పైలెట్. లయన్ ఎయిర్‌ ఫ్లయిట్‌లో బాలీకి వెళ్తున్నవారికి ఈ విచిత్ర ఆఫర్ వినడంతో వారు ఒంటికాలిపై లేచారు. అప్పటికే ఆ విమానం జావా ద్వీపం నుంచి ఆలస్యంగా బయల్దేరడంతో ఆగ్రహంతో వున్న ప్రయాణికులకు ఈ కుళ్లు జోకు మింగుడు పడలేదు. ఈ ఆఫర్ వారి కోసాన్ని మరింత పెంచింది.

అప్పటికే కాక్‌పిట్‌ లోపలి నుంచి మూలుగుతున్న శబ్దాలు వినిపించాయి.  దీంతో లాంబెర్టస్ అనే ప్రయాణికుడికి కోపం తన్నుకొచ్చింది. కో పైలెట్ వ్యహారంపై అతడు రవాణా మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశాడు. విమానం ఆలస్యం అయితే ప్రయాణికులకు ఎయిర్‌ హోస్టెస్‌లను ఆఫర్‌ చేయడం లయన్ ఎయిర్ సంస్థ అనుసరిస్తున్న విధానమా? అని నిలదీశాడు. విమానం ల్యాండ్ కాగానే కోపైలట్‌ను పట్టుకునేందుకు ప్రయాణికులంతా విఫలయత్నం చేశారు. మరోవైపు లాంబెర్టస్ ఫిర్యాదుపై లయన్ ఎయిర్ అధికారులు స్పందించారు. ఆ కో పైలట్‌పై విచారణ జరుపుతున్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఆ పైలెట్‌ను సస్పెండ్ చేశారు. అయితే కోపైలట్ ముఖానికి అత్యంత దగ్గరగా మైక్ వుందని, కాక్ పిట్ లోంచి వచ్చిన శబ్ధాలు ఆయన శ్వాసనిశ్వాసలని లయన్ ఎయిర్ జనరల్ ఎఫైర్స్ డైరెక్టర్ ఎడ్వట్ సిర్యాట్ తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : air hostess  Indonesian airline  flight delay  Lambertus Maengkom  co-pilot  

Other Articles