kejriwal second most followed indian politician on twitter

Arvind kejriwal most followed indian politician on twitter after modi

Arvind Kejriwal, Twitter, Arvind Kejriwal Twitter, PM modi twitter, narendra modi, big b, amitabh bachan, amitabh twitter, big b twitter, 16 million followers, Ankit Lal, shahi tharoor, shahi tharoor twitter, lokpal bill passed, lokpal bill, jan lokpal bill, lokpal bill passed in delhi, lokpal bill passed in parliament, aap news, kejriwal

Delhi Chief Minister Arvind Kejriwal has become the second most-followed Indian politician on microblogging site Twitter with over six million followers.

ప్రధాని మోడీ తరువాత.. ఆ ఘనత సాధించిన కేజ్రీ

Posted: 11/19/2015 12:43 PM IST
Arvind kejriwal most followed indian politician on twitter after modi

ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆప్ అగ్రనేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ తెల్లవారు జూమునే మరో ఘనత సాధించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తరువాత ఆ ఘనత సాధించిన రెండో రాజకీయ నేతగా అరవింద్ కేజ్రీవాల్ అవతరించారు. ఇంతకీ అదేంటని ఆరా తీస్తున్నారా..? మన దేశంలో ట్విటర్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన రెండో రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. బుధవారం రాత్రికి ట్విటర్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 60 లక్షలకు చేరింది. ట్విటర్ లో 60 లక్షల మార్క్ ను కేజ్రీవాల్ దాటారని 'ఆప్' సోషల్ మీడియా చీఫ్ అంకిత్ లాల్ తెలిపారు.

ట్విటర్ లో కేజ్రీవాల్ కంటే ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక మంది ఫాలోవర్లతో ముందున్నారు. 1.6 కోట్ల మంది ఆయనను అనుసరిస్తున్నారు. సోషల్ మీడియాను విరివిరివిగా వాడే రాజకీయ నాయకుల్లో వీరిద్దరూ అగ్రస్థానంలో ఉన్నారు. ట్విటర్ లో ఎక్కువ మంది పాలోవర్లు కలిగిన రాజకీయ నాయకుల్లో కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా ఒకరు. ఆయనకు 35 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సెలబ్రిటీల ట్విటర్ జాబితాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ 1.7కోట్ల ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  Twitter  16 million followers  Ankit Lal  

Other Articles