lovers attacked by thugs at hyderabad

Thugs attack on lovers at rama krishna theater

Attacks On Lovers, Thugs attacked Lovers, Attacks On Lovers At Rama Krishna Theater, Thugs Attack, Lovers, Rama Krishna Theater, Rama Krishna Theater in Hyderabad, viral video, Video viral in Social Media, lovers attack video, hyderabad lovers attack video

Thugs attacked Lovers at Rama Krishna Theater in Hyderabad. This Video became viral in Social Media Sites.

ITEMVIDEOS: హైదరాబాద్ లో ప్రేమజంటపై పోకిరీల దాడి..

Posted: 11/18/2015 03:32 PM IST
Thugs attack on lovers at rama krishna theater

హైదరాబాద్ లోని ఓ ప్రేమ జంటపై పోకిరీలు దాడికి పాల్పడ్డారు. యవతితో పాటు రామకృష్ణ థియేటర్ కు వచ్చిన యువకుడిని టికెట్లు తీసుకుని సినిమా ధియేటర్ లోనికి వెళ్తుండగా మార్గమధ్యంలోనే జంటను అడ్డుకున్న పోకిరీలు వారిపై దాడి చేశారు. పోకిరీల అకస్మిక దాడితో ఖంగుతిన్న యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోతుండగా, అతన్ని థియేటర్ బయట వరకు గెంటేసిన పోకిరీలు.. రోడ్డుపై కూడా దాడికి పాల్పడ్డారు. యువతితో కూడా అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీలు అమెను అక్కడి నుంచి వెళ్లిపోమ్మని హుకుం జారీ చేశారు.

కాగా రామకృష్ణ థియేటర్ లో ప్రేమజంటపై దాడి తతంగాన్ని మొత్తం తమ సెల్ ఫోన్ లలో బంధించిన పోకిరీలు తమకు చెందిన ఫేస్ బుక్ లలో సదరు వీడియోను అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు. రామకృష్ణ థియేటర్‌లో సినిమాకు వెళ్లిన జంటపై ఈ దాడి జరిగింది. గతంలో ఇలాంటి సంఘటనలు హైదరాబాద్‌లో కొన్ని చోట్ల జరిగినట్లు ఫిర్యాదులు అందాయని అప్పుడు మఫ్టీలో పోలీసులను రంగంలోకి దించామని పోలీసులు తెలిపారు. కొంత వరకు కట్టడి చేశామన్నారు.

తాజాగా జరిగిన ప్రేమికుల దాడి ఘటనకు సంబంధించి వీడియో అందజేస్తే, సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి సీసీ కెమెరాను పరిశీలించి, దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని పోలీస్‌ అధికారులు చెప్పడంతో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోకి అందిన వీడియోను సెంట్రల్‌ జోన్‌ పోలీస్‌ అధికారికి అందజేసింది. ప్రేమ జంటపై జరిగిన దాడిపై సీసీ పూటేజీ కెమెరాలను పరిశీలించి పోకిరీలపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lovers  attack  thugs  ramakrishna theatre  viral video  

Other Articles