Pakistan Cricket Board Has Refused to Play Bilateral Series in India | India Vs Pakistan

Pakistan cricket board refuses to play bilateral series in india

pakistan cricket board, pcb chairman shahryan khan, bcci news, india vs pakistan, india pakistan biletaral series, indo pak home bilateral series, shahryan khan latest news

Pakistan Cricket Board Refuses to Play Bilateral Series in India : Pakistan will not tour India to play their 'home' bilateral series scheduled in December. A cricket website has quoted Pakistan Cricket Board chairman Shahryar Khan as saying that a third 'home' series in India was out of the question.

బీసీసీఐకి షాకిచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు

Posted: 11/16/2015 06:55 PM IST
Pakistan cricket board refuses to play bilateral series in india

దాయాది దేశమైన పాకిస్థాన్ తో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా బీసీసీఐకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెద్ద షాకే ఇచ్చింది. డిసెంబర్ లో జరగాల్సిన ఈ సిరీస్ ను భారత్ లో ఆడే ప్రసక్తే లేదని పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ స్పష్టంచేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఆ సిరీస్ ను యూఏఈలో మాత్రమే ఆడాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల బీసీసీఐ డిసెంబర్ లో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా భారత్ లోనే ఆడాలంటూ పీసీబీకి విన్నపించింది. ఈ విన్నపాన్ని తిరస్కరించిన షహర్యార్ ఖాన్.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరుదేశాల మధ్య జరగాల్సిన ఈ సిరీస్ ను భారత్ లో ఆడబోమని పేర్కొన్నారు. ఒకవేళ భారత్ తమతో ఆడాలనుకుంటే.. అది యూఏఈలో మాత్రమే జరుగుతుందని ఆయన తెలిపారు.

'భారత్ లో సిరీస్ ఆడాలని బీసీసీఐ కోరిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతున్నాం. యూఏఈలో జరగాల్సిన సిరీస్ ను భారత్ లో నిర్వహించడానికి మేము అంగీకరించం. ఇందులో వేరే ప్రశ్నే లేదు’ అని షహర్యార్ తెలిపారు. 2009లో లాహార్ లో శ్రీలంక -పాకిస్థాన్ ల మధ్య సిరీస్ జరిగే సమయంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. అప్పట్నుంచి పీసీబీ తమ క్రికెట్ సిరీస్ లను స్వదేశంలో నిర్వహించకుండా మిగతా వేదికలపై జరుపుతోంది. దీనిలో భాగంగానే బీసీసీఐ-పీసీబీల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్ లకు ఒప్పందం కుదరింది. ఆ ఒప్పందంలో ముందస్తు సిరీస్ ను డిసెంబర్ లో యూఏఈలో నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ తో క్రికెట్ సిరీస్ లు జరగడానికి రాజకీయ పరమైన అంశాలు ముడిపడి ఉండటంతో ఆ సిరీస్ ను భారత్ లో జరపాలని బీసీసీఐ భావించింది. కానీ.. పీసీబీ అందుకు తిరస్కరిస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. దీంతో ఈ సిరీస్ వుంటుందా..? వుండదా..? అన్న అనుమానాలు మళ్ళీ తెరమీదకి వచ్చాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pcb chairman shahryar khan  indo pak home bilateral series  

Other Articles