paris police suspect the main accused behind the attacks | paris attack controversies

Paris police suspect the main accused behind the attacks

paris attack accused, paris attack suspect, france police, paris attack news

paris police suspect the main accused behind the attacks : police suspect the main accused behind the paris attacks.

పారిస్ దాడులు చేయించిన సూత్రధారి అతడేనట!

Posted: 11/16/2015 06:15 PM IST
Paris police suspect the main accused behind the attacks

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల వెనకున్న కీలక సూత్రధారిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అప్పటివరకు సంతోషంగా వున్న వాతావరణాన్ని ఒక్కసారిగా మారణహోమం సృష్టించిన ఉగ్రవాద దాడుల వ్యూహరచన చేసిన ఆ వ్యక్తి పేరు అబ్బుల్ హమీద్ అబౌద్ గా ఫ్రాన్స్ అధికారులు అనుమానిస్తున్నారు.

26 ఏళ్ల అబ్బుల్ చాలాకాలం క్రితమే ఈ దాడులకు వ్యూహరచన చేస్తూ వస్తున్నాడని పోలీసులు అనుకుంటున్నారు. అతగాడు కొందరు యువకులను బాగా రెచ్చగొట్టి.. ఈ దాడులు చేయించేలా కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతనితోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆ ఇద్దరిలో ఒకరు సిరియన్ కాగా, మరొకరు ఫ్రాన్‌ జాతీయుడని, అతనిపై ఉగ్రవాదిగా గతంలో కేసు నమోదయిందని నిర్ధారించారు. ఫ్రాన్స్ జాతీయ స్టేడియం బయట తనను తాను పేల్చుకున్న ఆత్మాహుతి బాంబర్ సిరియా వ్యక్తి అని, అతని పేరు అహ్మద్ అల్ మహమ్మద్ గుర్తించారు. అంతేకాదు.. మరో కీలకమైన విషయాన్ని పోలీసులు కనుగొన్నట్లు తెలిసింది. సిరియాకు చెందిన ఉగ్రవాది మృతదేహం వద్ద లభించిన పాస్‌పోర్టుపై వున్న వేలిముద్రలు గతనెల  గ్రీస్‌లో తీసుకున్న వేలిముద్రలతో సరిపోయాయని చెప్పారు.

ఇదిలావుండగా.. ఈ ఉగ్రవాద దాడులకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానిత ఇస్లామిక్ స్టేట్ కార్యకర్తల ఇళ్లు, నివాసాలపై పెద్ద ఎత్తున పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపి సూత్రధారుల గురించి పక్కా ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paris attack accused  paris attack suspect  france police  paris attack news  

Other Articles