Grand Alliance Possible for Uttar Pradesh Polls

Grand alliance possible for uttar pradesh polls

Taking a cue from the massive victory of the Grand Alliance against BJP in Bihar, Uttar Pradesh Chief Minister Akhilesh Yadav today said such a tie-up was possible in the state where Assembly elections are due in early 2017. "A Grand Alliance is possible in the state," Mr Yadav told reporters when asked about possibility of such a coalition materialising in UP to take on BJP in 2017 assembly polls.

యూపీలో కూడా మహా కూటమికి అవకాశం..!

Posted: 11/16/2015 11:57 AM IST
Grand alliance possible for uttar pradesh polls

దేశ, విదేశాల్లో తనకంటూ తిరుగులేని చరిష్మాను సొంతం చేసుకున్న బారత ప్రదాని నరేంద్ర మోదీకి గత కొంత కాలంగా గడ్డు పరిస్థితి నెలకొంది. బీహార్ లో మహా కూటమి విజయంతో మోదీ మీద విమర్శల వర్షం కురిసింది. మోదీ నాయకత్వం మీద చాలా మంది సొంత పార్టీ నాయకులే మండిపడ్డారు. అయితే బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా మోదీని, బిజెపి పార్టీని ఓడించాలని కంకణం కట్టుకున్న నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లు మరి కొన్ని పార్టీలను కలుపుకొని మహా కూటమిని ఏర్పాటు చేశారు. అలా మహా కూటమిని ఏర్పాటు చెయ్యడమే కాకుండా.. బీహార్ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అయితే తాజా బీహార్ బాటలోనే యుపి కూడా ప్రయాణిస్తుందా అనే దాని మీద క్లారిటీ లభించింది.

Also Read: బిజెపిని, మోదీని కాపాడే వ్యక్తి అతడే

బీహార్ లో మాదిరిగానే తమ రాష్ట్రంలో కూడా మహా కూటమి ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నట్లు ఉత్తర్ ప్రదేశ్ సిఎం అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. 2017 ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనానికి తెర తీశాయి. బీహార్ లో మాదిరిగానే తాము కూడా మహా కూటమిగా ఏర్పాడేందుకు పూర్తి అవకాశాలున్నాయని అన్నారు. కాగా అంతకు ముందు సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఎన్నికల్లో ములాయం సింగ్, మాయావతి కలిసి పని చెయ్యాలని.. అలా చేస్తారని తాను భావిస్తున్నట్లు ప్రకటించారు. అలా సమాజ్ వాదీ పార్టీ, బిఎస్పీ పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం బిజెపి పార్టీకి పరాభవం తప్పదు అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరి యుపిలో కూడా బీహార్ ఫలితాలు రిపీట్ అవుతాయా..? లేదా అన్నది వేచి చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles