Pregnent great escape by hanging window door

Pregnent great escape by hanging window door

ISIS, paris, Paris Attack, France, france attack, Escape from Paris Attack

A Pregnent lady great escape from paris attack at Bataclan hall. She callfor help but no body help her. She escape by handing at window door.

ITEMVIDEOS: కిటికీకి వేలాడి ప్రాణాలు కాపాడుకున్న గర్భవతి

Posted: 11/16/2015 11:21 AM IST
Pregnent great escape by hanging window door

ప్యారిస్ లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ప్యారిస్ నగరంలోని పలు చోట్ల ఉగ్రవాదులు దాష్టికానికి దిగారు. దాదాపు 129 మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న ఉగ్రవాదులు చిన్న పిల్లలు, ఆడవాళ్లు, అమాయకులు అన్న తేడా లేకుండా రక్తపాతాన్ని సృష్టించారు. అయితే ఉగ్రవాదుల దాడిలో చాలా మంది ప్రాణాలను కోల్పోగా.. మిగిలిన వారు ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు. అయితే అలా గాయాలతో బయటపడ్డవారు కొందరైతే.. మరి కొందరు బ్రతుకు జీవుడా అంటూ పరుగులు తీశారు. అయితే తాను గర్భవతినని.. తనను కాపాడమని ఎంతలా సహాయం కోసం అరిచినా లాభం లేకుండా పోయింది. దాంతో తానో సాహసం చేసింది.

Also Read: ఐసిస్ మీద ఫ్రాన్స్ యుద్దం మొదలైంది

ప్యారిస్ లోని బాటాక్లాన్ ధియేటర్ వద్ద ఉగ్రవాదులు దాడులు ప్రారంభించారు. దాడుల విషయాన్ని గమనించిన చాలా మంది ప్రాణాల కోసం పరుగులు పెట్టారు. చాలా మందిని వెంటపడి కాల్చివేశారు ఉగ్రవాదులు. అయితే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎలాగైనా ప్రయత్నించారు చాలా మంది. ఓ గర్భవతి తాను గర్భవతినని.. తనకు సహాయం చెయ్యడం అంటూ అరిచింది కానీ ఆమెకు ఎవరూ సహాయం చెయ్యలేదు. ఓ వైపు ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు.. దాంతో ఏం చెయ్యాలో పాలుపోక.. రెండో అంతస్తులోని కిటికీకి వేలాడి తన ప్రాణాలను కాపాడుకుంది. కిటికీకి వేలాడుతున్న గర్భవతిని మరో వ్యక్తి కాపాడాడు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  paris  Paris Attack  France  france attack  Escape from Paris Attack  

Other Articles