Who is Imran Khan that Modi said

Who is imran khan that modi said

Modi, Imran Khan, Rajasthan, India, UK, Modi in UK, Modi in UK, Modi in Uk visit

Modi gave excelelnt speech in Vembli stadium. He told a story of Imaran Khan to give description what is India.

మోదీ చెప్సిన ఇమ్రాన్ ఖాన్ ఎవరు..?

Posted: 11/14/2015 12:35 PM IST
Who is imran khan that modi said

భారత ప్రధాని నరేంద్ర మోదీ యుకెలో పర్యటిస్తున్నారు. అక్కడ ఆత్మీయ ఆతిధ్యాన్ని అందుకుంటున్నారు. అక్కడి వీధి వీధి మోదీ నామస్మరణ చేస్తోంది. వెల్ కం మోదీ అంటూ అక్కడి వారు రోడ్ల మీదకు వస్తున్నారు. బారత్ నుండి వచ్చిన తమ నాయకుడిని చూసేందుకు వేల సంఖ్యలో మోదీ అభిమానులు బారులు తీరారు. మోదీ యుకెలో ప్రసంగించిన తీరు అందరికి కట్టిపడేసింది. భారత్ అంటే మీరు టీవీల్లో చూస్తున్నది కాదు.. పేపర్లో వస్తున్న వార్తల్లో ఉన్న భారత్ కాదు.. అంతకంటే పెద్ద.. అంతకంటే విశాలమైన బారత్ ఉంది అంటూ మోదీ అద్భుతమైన, చరిత్రలో నిలిచిపోయేలా ప్రసంగం చేశారు. మోదీ ప్రసంగం మీద ఒమర్ అబ్దుల్లా కూడా హర్షం వ్యక్తం చేశారు. బారత ఔనత్యాన్ని చాటుతున్నారిన ప్రశంసించారు. అయితే మోదీ ప్రసంగంలొ ఓ వ్యక్తి గురించి వివరించారు. ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి గురించి మోదీ చెప్పినతర్వాత చప్పట్ల వర్షం కురిసింది.



Also Read: మోదీ మానియా తగ్గిందనుకోవడం 'మాయ'

మోదీ ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి గురించి వివరించారు. ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తిలోనే బారత్ ఉంది అని మోదీ చెప్పగానే.. చప్పట్లతో ఆ స్టేడియం మొత్తం మోత మోగింది. రాజస్థాన్ కు చెందిన ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి గురించి మోదీ వివరించిన తీరు.. ఇమ్రాన్ ఖాన్ చేసిన పని అందరికి చేత చప్పట్లు కొట్టించుకున్నాయి. రాజస్థాన్ కు చెందిన ఆల్వర్ అనే ప్రాంతంలో ఇమ్రాన్ ఖాన్ అనే ఓ వ్యక్తి ఉన్నాడు.. అతడు టీచింగ్ అంటే చాలా ఇష్టపడతాడు.. ఇమ్రాన్ ఖాన్ చిన్నారుల కోసం ఏదైనా చేద్దామని అనుకున్నాడు.. అందుకు విద్యార్థులకు పనికి వచ్చేలా యాప్ లను తయారు చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై యాప్ లను తయారు చేశాడు. వాటిని విద్యార్థులకు ఫ్రీగా అందించారు. అది.. ఇమ్రాన్ ఖాన్ లో భారత్ ఉంది.. మీరు వార్తల్లో చూస్తున్నది కాదు అంటూ మోదీ వివరించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Imran Khan  Rajasthan  India  UK  Modi in UK  Modi in UK  Modi in Uk visit  

Other Articles