Modi mania continues from Inda to UK

Modi mania continues from inda to uk

Modi, Modi mania, India, UK, PM Modi, Modi UK Visit, Modi in UK, Narendra Modi, Modi speech in UK Parliament

Indian PM Narendra Modi recived excellent hostage from UK. In UK modi saw his mania. Thousands of UK people and Indian origin people glad to meet Modi.

మోదీ మానియా తగ్గిందనుకోవడం 'మాయ'

Posted: 11/14/2015 10:30 AM IST
Modi mania continues from inda to uk

భారత ప్రధాని నరేంద్ర మోదీకి బారత్ తో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోదీ అంటే.. పవర్, లీడర్. మోదీ మాటల మంత్రం ఎంతో మందిని ఊపిస్తోంది.. ఎంతో మందిని మాతృదేశం ఏదొ ఒకటి చెయ్యాలనేలా చేస్తోంది. బారత మాత ముద్దు బిడ్డగా మోదీకి ఉన్న క్రేజ్ గురించి పరిచయం అక్కర్లేదు. కానీ కొంత మంది, కొన్ని ఘటనల వల్ల మోదీ మానియా తగ్గిందని ప్రచారం జరుగుతోంది. కానీ అది ఎంత మాత్రం వాస్తవం కాదు అని తెలుస్తోంది. మోదీ అంటే మోదీనే.. ఎవరూ సాటిరారు అని తెలుస్తోంది. తాజాగా యుకెలొ మోదీకి లభించిన ఆత్మీయ ఆహ్వానం.. అక్కడ ప్రతి అడుగులో మోదీ మానియా కనిపిస్తోంది.

Also Read: మోదీ మానియాకు వ్యతిరేకంగా సునామి - ఉద్దవ్ థాక్రే

మోదీ యుకెలొ అడుగుపెట్టక ముందే మోదీ మానియా మొదలైంది. అక్కడ మోదీ వెల్ కం టు యుకె అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు వెలిశాయి. ప్రతి చోట ఇండియా ఫ్లాగ్ లు ధరించి.. మోదీ రాకను ఆహ్వానించారు. బ్రిటన్ ప్రధాని దగ్గరి నుండి మంత్రులు, అధికారులు ఇలా అందరూ మోదీకి ఆత్మీయంగా స్వాగతం పలికారు. మోదీ బ్రిటన్ వచ్చిన సందర్భంగా బారతీయత ఉట్టిపడింది. బ్రిటన్ ప్రధాని జేమ్స్ కామెరూన్ మరింత జోష్ నింపారు. ‘నమస్తే’ అంటూ ఆయన నోట హిందీ మాట వినిపించడంతో స్టేడియంలో ఎన్నారైలు కేరింతలు కొట్టారు. ఇక కామెరూన్ సతీమణి సమంత భారతీయ సంప్రదాయ వస్త్రధారణ చీరకట్టులో కార్యక్రమానికి హాజరై సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక మోదీ ప్రసంగం ముగిసిన తర్వాత ఏర్సాటు చేసిన ఫైర్ వర్క్స్ అందరిని ఆకట్టుకున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Modi mania  India  UK  PM Modi  Modi UK Visit  Modi in UK  Narendra Modi  Modi speech in UK Parliament  

Other Articles