Prime minister is not a section officer

Prime minister is not a section officer

PM, Modi, section officer, Shourie, arun Shourie, Modi on dadri, Arun Shourie on Modi

Prime minister is not a section officer of the homoeopathy department. He is not head of a department. He is the prime minister. He has to show the country the moral path. He has to set moral standards," Shourie said in a TV interview.

ప్రధాని అంటే సెక్షన్ ఆఫీసర్ కాదు

Posted: 11/03/2015 01:03 PM IST
Prime minister is not a section officer

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని అంటే సెక్షన్ ఆఫీసర్ కాదని, దేశ నైతిక ప్రమాణాలకు ఆయన నిదర్శనంగా నిలబడాలని శౌరి సూచించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే 'దాద్రి' ఘటనపై మోదీ మౌనం దాల్చారని ఆరోపించారు. ప్రధాని అంటే హోమియోపతి డిపార్ట్ మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ కాదు, హెడ్‌ ఆఫ్ ద డిపార్ట్ మెంటూ కాదు. ఆయన దేశానికి ప్రధాన మంత్రి. నైతిక మార్గంలో నడుస్తూ ప్రమాణాలు నెలకొల్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది అని అరుణ్ శౌరి వ్యాఖ్యానించారు. అసహనం పెరిగిపోవడం, గోమాంసం వివాదం నేపథ్యంలో అరుణ్ శౌరి ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఏకు కొనసాగింపుగా ఎన్డీఏ పాలన ఉందని అంతకు ముందు శౌరి విమర్శించిన విషయం తెలిసిందే!

బీహార్ లో ఓట్ల కోసం దాద్రి ఘటనపై ప్రధాని మోదీ మౌనం వహిస్తే ఆయన మంత్రులు, బీజేపీ నేతలు మాత్రం దాద్రి చిచ్చు చల్లారకుండా చూస్తున్నారని ఆరోపించారు. 2002 నుంచి అసహనానికి ఎక్కువగా గురైంది ప్రధాని నరేంద్ర మోదీయేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై శౌరి స్పందించారు. మోదీని గుడ్డిగా వెనకేసుకు వస్తున్నారని అన్నారు. అవార్డులు వెనకకు ఇచ్చేస్తున్నవారి వెనుక రాజకీయ శక్తులున్నాయన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM  Modi  section officer  Shourie  arun Shourie  Modi on dadri  Arun Shourie on Modi  

Other Articles