election commission has issued notices to rahul gandhi, lalu prasad yadav and amit shah for doing controversial comments in bihar election campaign | bihar elections

Election commission issued notices to rahul gandhi lalu prasad yadav amit shah bihar elections

election commission issued notices to rahul gandhi lalu prasad yadav amit shah bihar elections : election commission has issued notices to rahul gandhi, lalu prasad yadav and amit shah for doing controversial comments in bihar election campaign.

election commission issued notices to rahul gandhi lalu prasad yadav amit shah bihar elections : election commission has issued notices to rahul gandhi, lalu prasad yadav and amit shah for doing controversial comments in bihar election campaign.

రాహుల్, అమిత్, లాలూలకు ‘నోటిదూల’ ఎక్కువైంది!

Posted: 11/02/2015 10:34 AM IST
Election commission issued notices to rahul gandhi lalu prasad yadav amit shah bihar elections

బీహార్ ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ, మహాకూటమి విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఆవేశంలో పలువురు నేతలు తమ నోటికి బాగానే పనిచెప్పారు. ఎలాగో తామున్నది పెద్ద హోదాలో కాబట్టి ఏం చెప్పిన చెల్లుతుందనే భావనతో సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీహార్ మాజీ సీఎం-ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ముందు వరుసలో వున్నారు. ఈ ఎన్నికల ప్రచార నేపథ్యంలోనే వీరు ముగ్గురు చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా నిలవడంతోపాటు వివాదాలకూ దారితీశాయి. అందుకే.. వీరి నోటిదూలకు కంచె వేసేందుకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) కీలక అడుగు వేసింది. ఆ ముగ్గురు ఎన్నికల నియమావళిని అతక్రమించారంటూ ఎన్నికల సంఘం వారికి నోటీసులు జారీ చేసింది.

ఈ ఎన్నికల ప్రచార నేపథ్యంలో.. ‘ఇక్కడ బీజేపీ ఓడిపోతే పాకిస్థాన్ లో మతాబులు పేలతాయి’ అని అమిత్ షా కామెంట్ చేసిన విషయం తెలిసిందే! ఆ విధంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం వల్ల ఈసీ అమిత్ షాకు నోటీసులు జారీ చేసింది. ఇక ‘హిందూ, ముస్లింల మధ్య బీజేపీ గొడవలు పెడుతోంది’ అన్న కామెంట్లపై రాహుల్ కు ఈసీ శ్రీముఖం పంపింది. అలాగే.. మోదీని ‘వాంపైర్’ (రక్తపిపాసి)గా అభివర్ణించిన లాలూకు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రసంగం చేసిన బీహార్ అధికార పార్టీ జేడీయూ అధినేత శరద్ యాదవ్ ను కూడా ఈసీ వదల్లేదు. వివాదాస్పద వ్యాఖ్యలకు నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాలని సదరు నోటీసుల్లో నేతలకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలావుండగా.. బీహార్ ఎన్నికల తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తి కాగా, చివరి దశల్లో ఐదో విడత పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలు ముగిసేలోపే తాము చేసిన సంచలన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఈసీ నోటిసుల్లో ఆయా నేతలకు ఆదేశించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : election commission  rahul gandhi  amit shah  lalu prasad yadav  bihar elections  

Other Articles