astrologer bejan daruwalla says modi has came to him to show his astrology before become pm | narendra modi controversy | bihar great alliance

Bejan daruwalla astrologer sensational comments on narendra modi bihar elections

bihar elections, astrologer behan daruwalla, pm narendra modi, lalu prasad yadav, bihar cm nitish kumar, rahul gandhi, bihar great alliance, modi controversy, narendra modi news

bejan daruwalla astrologer sensational comments on narendra modi bihar elections : astrologer bejan daruwalla says modi has came to him to show his astrology before become pm.

మోదీ తలకు చుట్టుకున్న ‘జ్యోతిష్యం’ తంటా!

Posted: 11/02/2015 10:04 AM IST
Bejan daruwalla astrologer sensational comments on narendra modi bihar elections

బీహార్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు బీజేపీ, మహాకూటమి ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆయా పార్టీలను బలహీనపరిచే కొన్ని ఆసక్తికరమైన రహస్య విషయాలు బట్టబయలు అవుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ తన భవిత్యంపై జ్యోతిష్యం చెప్పించుకునేందుకు ఓ తాంత్రికుడ్ని కలిసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. దానిని ఆసరా తీసుకుని బీజేపీ పార్టీ ఆయనకు వ్యతిరేకంగా దుమ్మెత్తి పోస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రచారంలో ఎడతెరిపి లేకుండా దూసుకుపోతున్న ప్రధాని మోదీ ఆ వీడియోని అడ్డం పెట్టుకుని నితీష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతానోనంటూ భయంతో నితీష్ జ్యోతిష్యం చెప్పించుకున్నారంటూ మోదీ పలుసార్లు విరుచుకుపడ్డారు. అయితే.. ఇప్పుడు అదే ‘జ్యోతిష్యం’ తంటా మోదీ తలకు చుట్టుకుంది. ఈయన కూడా గతంలో తనతో జ్యోతిష్యం చెప్పించుకున్నారని ఓ ప్రముఖ జ్యోతిష్యుడు ప్రకటన చేసి, మరో సంచలనానికి తెరలేపారు.

ప్రధాని కాకముందు మోదీకి తాను హస్తవాసి చూశానని ప్రముఖ జ్యోతిష్యుడు బేజన్ దరువాలా సంచలన ప్రకటన చేశారు. మోదీ హస్తవాసిని చూని ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పానని కూడా ఆయన వ్యాఖ్యానించి మరింత కలకలం రేపారు. ఆదివారం ఇండోర్ కు వ్యక్తిగత పర్యటన నిమిత్తం వచ్చిన దరువాలా... అక్కడ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఏ సమయంలో తాను మోదీకి జ్యోతిష్యం చెప్పానన్న విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పలేదు కానీ.. ప్రధాని కాకముందు ఆయన హస్తవాసి చూపినట్లుగా ఆయన వెల్లడించారు. ఏదేమైనా.. దరువాలా చేసిన ప్రకటన మహా కూటమికి మంచి పాయింటే లభించినట్టయ్యింది. మహా కూటమి నేతలు ప్రచారాస్త్రంగా మలచుకుని ప్రధానిని ఇబ్బంది పెట్టడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ప్రచారం చేయడానికి అన్ని ప్రణాళికలు వారు సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. ఈ ప్రచారం మహాకూటమికి ఎంతమాత్రం హెల్ప్ అవుతుందో వేచి చూడాల్సిందే. అయితే.. మోదీ మేనియా ముందు ఇటువంటి ప్రచారాలు ఏమాత్రం పనిచేయవని, బీహార్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar elections  narendra modi  bihar great alliance  astrologer behan daruwalla  

Other Articles