Mumbai court sentence hang to anusha killer

Mumbai court sentence hang to anusha killer

Mumbai Court, Anusha case, anusha murder, Anushan Missing, Chandrabhan

Mumbai court took final judgement on Software engineer Anusha case. Court sentenced hang for chandrabhanu, who killed anusha brutually.

అనూహ్య కేసు దోషికి ఉరి

Posted: 10/30/2015 01:00 PM IST
Mumbai court sentence hang to anusha killer

దేశంలో అత్యాచారాలు, హత్యలు చేసే వారికి ఓ హెచ్చరిక. ఎవరైనా సరే మానవత్వాన్ని మరిచి... మృగంలా ప్రవర్తిస్తే వారికి భారత్ లో ఎలాంటి శిక్షపడుతుందో కళ్లారా చెప్పిన ఘటన ఇది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసులో దోషీ చంద్రభాన్కు ఉరిశిక్ష పడింది. ముంబై కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముంబై కోర్టు చంద్రభాన్ను దోషీగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. శిక్షను ఈ రోజు ఖరారు చేసింది. తన కూతురికి జరిగిన అన్యాయం ఏ తండ్రికి జరగకూడదని అనూహ్య తండ్రి కోరికలో సగం తీరింది. తన కూతురిని శవంగా మార్చిన మృగానికి కోర్ట్ ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.. దాంతో ఆ తండ్రి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ.. 2014 జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్ వద్ద అనూహ్య అదృశ్యమైంది. టాక్సీ డ్రైవర్ చంద్రభాన్  ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజన్ థాక్రే.. చంద్రభాన్కు ఉరి శిక్ష విధించాలని కోర్టును కోరారు. చంద్రభాన్ క్రూరమైన నేరానికి పాల్పడ్డాడని, అనూహ్యను అత్యాచారం చేసి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చివేశాడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి కేసుల్లో కోర్టులు కఠినంగా వ్యవహరించాయని, చంద్రభాన్కు అత్యంత కఠిన శిక్ష విధించాలని రాజన్ థాక్రే కోర్టుకు విన్నవించారు. అంతకు ముందే చంద్రభాన్ ను దోషిగా తేల్చగా.. తాజాగా ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai Court  Anusha case  anusha murder  Anushan Missing  Chandrabhan  

Other Articles