Get Jobs by using internet

Get jobs by using internet

Jobs, facebook, Mark Zuckerberg, Facebook CEO, Delhi, IIT, Facebook CEO in Delhi

At a townhall meeting, Facebook CEO Mark Zuckerberg addressed students at the Indian Institute of Technology (IIT) in Delhi.. Cant Connect The World Without Connecting India.

ఇంటర్నెట్ తో జాబ్ లు పొందొచ్చు

Posted: 10/28/2015 03:03 PM IST
Get jobs by using internet

పేదరికంను దూరం చేసే సత్తా ఇంటర్నెట్ కు ఉంది అని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెన్ బర్గ్ వెల్లడించారు. ఆయన ఢిల్లీ ఐఐటీ విద్యార్ధులతో ముచ్చటించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. భారత్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ భూకంప బాధితులకు ఫేస్‌బుక్ సాయం అందిస్తోందన్నారు. ప్రపంచంలో భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఆ దేశం లేకుండా ప్రపంచ దేశాలతో సంబంధాలు చేపట్టలేమన్నారు. వంద కోట్ల ప్రజలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. మార్క్‌జుకర్‌బర్గ్ నిన్న తాజ్‌మహాల్‌ను సందర్శించారు. తాజ్ అందాలు అద్భుతమని వర్ణించారు. తాను ఊహించిన దానికన్నా ప్రేమసౌధం అందంగా ఉందన్నారు.

భారతీయులతో కనెక్ట్ కాకుండా ప్రపంచంతో కనెక్ట్ అవలేమని కూడా మార్క్ జుకెన్ బర్గ్ వెల్లడించారు. భారత్ లో చాలా మంది నేటికీ ఇంటర్నెట్ కు దూరంగా ఉన్నారని.. వారందరికీ కూడా ఫేస్ బుక్ ఓఆర్జి ద్వారా ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కాగా మార్క్ జుకెన్ బర్గ్ ను క్యాండీక్రష్ గురించి ప్రశ్నించారు క్యాండీక్రష్ గురించి నోటిఫికేషన్లు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలని జుకెన్ ను ప్రశ్నించారు. దానికి సమాధానంగా.. మరోసారి సమావేశం పెట్టేలోపు ఖచ్చితంగా దీనికి సమాధానం వెతకమని.. డెవలప్ మెంట్ టీంకు చెప్పానని అన్నారు. తనకు ఆడబిడ్డే పుడుతుందని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  facebook  Mark Zuckerberg  Facebook CEO  Delhi  IIT  Facebook CEO in Delhi  

Other Articles