Men Should Share Wives To Solve Chinas Gender Imbalance

Men should share wives to solve chinas gender imbalance

china, husband, Xie Zuoshi, China economist

Chinese economist, Xie Zuoshi, has shocked many people after he suggested polygamy as a solution to China's rising problem of gender imbalance. Zuoshi, who is an economics professor at Zheijing University of Finance and Economics sparked a digital backlash after he advocated polyandry in his blog post, which has now been removed

చైనాలో ఒక భార్య.. ఎందరో భర్తలు..!?

Posted: 10/28/2015 01:21 PM IST
Men should share wives to solve chinas gender imbalance

ఏంటి.. ఇదేదో గాలి వార్త అనుకుంటున్నారా..? కానే కాదు పాతకాలంలో ొక భార్యకు ఎందరో భార్యలు అని విన్నారుగా.. అలాంటిదే చైనాలో చెయ్యాలంటూ ప్రపోజల్ ముందుకు వస్తున్నాయి. ఎందుకు ఇలా అనుకుంటున్నారా..? పాపం అక్కడ బ్రహ్మచారుల సంఖ్య అంతకంతకు పెరుగుతోందట అందుకే చైనా ఈ పాత ప్లాన్ ను తెర మీదకు తీసుకువస్తోంది. 2020 నాటికి చైనాలో బ్రహ్మచారుల సంఖ్య మూడు కోట్లకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు. బ్రహ్మచారుల సంఖ్యకు తగినట్లుగా యువతులు లేకపోవడం చైనాలో ప్రధాన సమస్యగా మారింది. ఒక భార్య.. అనేక మంది భర్తలు అనే అంశాన్ని ఆమోదించడమే చైనాలో బ్రహ్మచారుల సమస్యకు సరైన పరిష్కారమని జీజింగ్ యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగం ఫ్రొఫెసర్ జీ జూషి ప్రతిపాదన చేశారు. అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకేసి ఇద్దరు పురుషులు వివాహం చేసుకునే విధంగా చట్టబద్ధత కల్పించడం మరో మార్గమని ఆయన సూచించారు. తన ప్రతిపాదనను తన మూడు బ్లాగుల్లో పోస్ట్ చేశారు. ఫ్రొఫెసర్ జీ జూషి చెప్పిన కొత్త భాష్యం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవ్వడమే కాకుండా పెద్ద దుమారం రేగింది. ఈ ప్రతిపాదన విస్తృతంగా చర్చకు దారి తీసింది.

దాంతో ఈ పోస్ట్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించారు. తాను ఆర్థిక కోణంలో ఈ సమస్యను చూశానని, ధరల పెరిగినపుడు వస్తువులు సంపన్నులకే అందుబాటులో ఉంటాయని, పేదవారికి లభించడం కష్టం ఉంటుంది. అదే మాదిరిగా యువతల కొరత ఉండి.. బ్రహ్మచారుల సంఖ్య ఎక్కువగా ఉన్నపుడు స్త్రీల విలువ పెరుగుతుందన్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఒకే మహిళను ఇద్దరు వ్యక్తులు వివాహామాడితే తప్పేంటని ప్రశ్నించారు. నైతిక విలువలు మంటగలిపాడంటూ ఈ ప్రతిపాదన చేసిన జీ జూషీకి పెద్ద ఎత్తున్న బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ ప్రతిపాదన చేసింది ఓ మనిషేనా అని నెటిజన్లు విరుచుకుపడ్డారు. అయినా ఆర్థిక శాస్ర్తం పేరుతో ఇలా వింత వింత ప్రతిపాదనలు చైనాలో చెల్లుతాయని అనుకోవడం జూషీ అతిఅనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  husband  Xie Zuoshi  China economist  

Other Articles