Elephant helped his calf to come out of pit

Mom rescues elephant calf in tamil nadu

infant elephant calf, Elephant helped his calf to come out of pit at coimbatore, Mom Rescues Elephant Calf in Tamil Nadu, mom elephant rescues its calf, coimbatore, tamilnadu elephant,

mom elephant helps its calf to come out of pit at a village near coimbatore in tamilnadu

తల్లి హృదాయానికి ఇదో తార్కాణం.. గోతిలో పడిన పిల్లను అడవిలోకి తీసుకెళ్లిన మాతృమూర్తి

Posted: 10/26/2015 06:56 PM IST
Mom rescues elephant calf in tamil nadu

అభయారణ్యం నుంచి తప్పిపోయి జనారణ్యంలోకి వచ్చిన ఓ ఏనుగు.. జనారణ్యంలో జనుల నుంచి, జనుల తీసే గోతలు నుంచి ఎలా తప్పించుకోవాలో తన శిక్షణ నిచ్చేందుకు వచ్చినట్లుంది అనేట్టుగా జరిగింది తమిళనాడులోకి కోయంబత్తూర్ లో ఒక సంఘటన. ఒక ఆడ ఏనుగు అడవి దగ్గరలో ఉన్న గ్రామంలోకి వచ్చి అక్కడ అరటి తోటలో ప్రసవించింది. తిరిగి అడవిలోకి వెళ్లే సమయంలో పిల్ల ఏనుగు గోతిలో పడిపోయింది. అప్పుడే పుట్టిన పిల్ల కావడంతో సరిగ్గా నడవలేక... గోతిలోనుంచి బయటకు రాలేక నానా అవస్థలు పడింది.

చివరికి తల్లి ఏనుగు జాగ్రత్తగా పిల్లఏనుగును బయటకు తీసి తనతోపాటు తీసుకుపోయింది. జనారణ్యంలో జనులతో జాగ్రత్తా అని హితబోధ కూడా చేసినట్లుంది. ఈ ఘటన తమిళనాడు కోయంబత్తూరు సమీపంలోని పెరియనాయక పాల్యంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఏనుగు పిల్ల, తల్లిని చూడ్డానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో చేరారు. సాధారనంగా ఏనుగులు ప్రసవ సమయంలో అడవిలో నుంచి బయటకు రావు. కానీ ఈ సందర్భంలో మాత్రం ఏనుగు గ్రామ ప్రాంతంలోకి రావడం ఆసక్తిగా మారింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : infant elephant  mom elephant  rescue  coimbatore  tamilnadu  

Other Articles