Watch This Suicidal Jihadi Cry And Hug His Terrorist Bros Before He Makes His Final Journey

Suicidal jihadi cry and hug his terrorist bros

Suicidal Jihadi Cry And Hug His Terrorist Bros Before He Makes His Final JourneyJafar al-Tayyar militant, Uzbek militant, jihadi suicide bomber, Imam Bukhari Jamaat, villages attacked Syria,

Jafar al-Tayyar isn't old enough to grow a beard, but he's old enough to ride an explosive loaded tank into oblivion. The Uzbek militant probably realised how crazy this is, and was crying as he got into the vehicle.

ITEMVIDEOS: జీహాదీ అత్మహుతుల వెనుక కన్నీటీ కథలెన్నో..

Posted: 09/24/2015 01:58 PM IST
Suicidal jihadi cry and hug his terrorist bros

ప్రపంచమే తమ గుప్పిట్లోకి తీసుకోవాలని, ఇది అల్లా తమకు అదేశించిన కార్యమని చెప్పుకుని.. అదే జీహాదీ అంటూ.. పవిత్ర యుద్దమంటూ.. ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టిస్తున్నఉగ్రవాదులు.. తమ సంస్థలో చేరిన ఎంతో మంది అమాయక మైనారిటీ ముస్లిం యువకులను పవిత్రయుద్దం కోసం పోరాడాలని సూచిస్తూ, అదేశిస్తూ.. వారి కుటుంబాలకు అడపాదడపా సాయం చేస్తూ.. కఠోర శిక్షణనివ్వడంతో పాటు వారిని ఆత్మాహుతి దాడులుగా కూడా మారుస్తున్నారు. పవిత్ర యుద్దం కోసం ప్రాణార్పణం చేయాలని అదేశిస్తున్నారు.



అయితే తమ కుటుంబసభ్యులతో వుండేందుకు అర్ధికంగా పరిస్థితులు బాగోలేక.. తాను మరణించినా పర్వాలేదు కానీ.. తమ కుటుంబసభ్యులైనా మూడు పూటలా బోజనం చేయాలన్న ఒకేఒక్క అలోచనతో ముందు వెనుక అలోచించకుండా అనేక మంది ముస్లిం యువకులు ఉగ్రవాద సంస్థలపైవు ఆకర్షితులవుతున్నారు. ఇక కొందరు అల్ ఖైదా, తాలిబన్, ఐస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల హింసాప్రేరేపిత రచనలను, ఉగ్రవాద ప్రోత్సహాక వ్యాసాలను బాగా వంటపట్టించుకుని నా ముస్లిం, మా అల్లా అనేలా రెచ్చగోట్టే కథనాలను చదవుతూ.. ఉగ్రవాద సంస్థలలో చేరుతున్నారు.

అయితే ఈ సంస్థలో చేరడం వారకు మాత్రమే వారిఇష్టం. ఆ తరువాత మానుకుని ఇంటికి తిరిగి వెళ్లాలంటే మాత్రం అనుమతి వుండదు. ఇక మరికొందరు నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా.. ఆత్మాహుతి సభ్యులుగా మారి దాడులు జరుపుతూ బలి చేసుకుంటున్నారు. అల్లా ఇచ్చిన నూరేళ్ల జీవితాన్ని ఉగ్రవాద నాయకులు మాత్రం జీవిస్తూ.. నూనూగు మీసాలు వస్తున్న నూతన యవ్వన యువకులను మాత్రం ఆత్మహుతి సభ్యులుగా మారుస్తూ.. జీవితాలను బలిగోంటున్నారు. ఇలా ఆత్మహుతి సభ్యుడిగా మారిన ఓ యువకుడిని సంస్థ సభ్యులు సమయం ఆసన్నమైంది ఇక పవిత్ర యుద్దంలో నీ ప్రాణార్ఫణ చేయాలని అదేశించడంతో.. ఆతను ఎలా వెక్కివెక్కి ఏడ్చాడో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jafar al-Tayyar militant  Imam Bukhari Jamaat  villages attacked Syria  

Other Articles