Jagmohan Dalmia passes away

Bcci chairman jagmohan dalmia passes away

bcci, Dalmia, Jagmohan Dalmia dead

BCCI Chairman Jagmohan Dalmia passes away Chairman of Board of Cricket Control in India (BCCI) Jagmohan Dalmia has on Sunday passed away. He was admitted to a hospital in Calcutta due to heart issue but couldn’t survive. Late Dalmia was 75-year-old. He remained the president of International Cricket Council (ICC) from 1997 to 2000 while he had also been nominated to chair BCCI in 2005.

బిసిసిఐ అధ్యక్షుడు దాల్మియా కన్నుమూత

Posted: 09/21/2015 08:34 AM IST
Bcci chairman jagmohan dalmia passes away

బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియా భౌతికకాయానికి ఇవాళ అంత్యక్రియలు జరిగే అవకాశాలున్నాయి. దాల్మియా మృతికి రాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.వ్యాపారం అంటే అతనికి ఇష్టం. క్రికెట్ అంటే అతనికి పిచ్చి. ఈ రెండింటిని కలిపి క్రికెట్‌కు కమర్షియల్‌ టచ్ ఇచ్చిన బిజినెస్‌మెన్ దాల్మియా. 1996 వరల్డ్‌ కప్‌ నుంచి బీసీసీఐ జాతకాన్నే మార్చేశారాయన. ఆటగాళ్లకు..బోర్డు సభ్యులకు కోట్లకు కోట్లు జీతాలు, ప్రోత్సాహాకాలు అందుతున్నాయంటే దాల్మియా బిజినెస్‌ ఫలితమే.

బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న దాల్మియా కొద్ది నెలలుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం రోజున గుండెనొప్పి రావటంతో కోల్‌కతాలోని బీఎం బిర్లా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు చెబుతూ వచ్చినా..నిన్న మళ్లీ గుండెనొప్పి రావటంతో దాల్మియా చనిపోయారు. దాల్మియా మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌, ప్రధాని మోడీతో రాజకీయ నాయకులు, క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి క్రికెట్‌కు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నిన్న దాల్మియా కుటుంబాన్ని పరామర్శించారు.

బీసీసీఐకి 36 ఏళ్లు సేవలు అందించిన దాల్మియా క్రికెట్‌లో ప్రతి అంశాన్ని కోట్లు దండుకునే స్థాయిలో కమర్షియల్‌ టచ్‌ ఇచ్చారు. 1978లో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌ కోశాధికారిగా క్రికెట్‌ బోర్డులో చేరిన దాల్మియా..1983లో బీసీసీఐ కోశాధికారిగా పనిచేశారు.1997లో ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దాల్మియా..క్రికెట్లో ఇండియా ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాడు. 2001 నుంచి మూడేళ్ల పాటు బీసీసీఐ ప్రసెడింట్‌డా పనిచేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు బోర్డు వ్యవహారాల్లో అంటిముట్టనట్టుగా వ్యవహించిన ఆయన..ఈ మధ్యే రెండోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bcci  Dalmia  Jagmohan Dalmia dead  

Other Articles