Gumnami Baba or Bhagwanji was Netaji Himself

Gumnami baba or bhagwanji was netaji himself

Bose, Netaji, Bhagwanji, Gumnami Baba, Freedom Fighter, India

Several people believed that the Hindu sanyasi named Bhagwanji or 'Gumnami Baba', who lived in the house Ram Bhawan in Faizabad, Uttar Pradesh at least until 1985, was Subhas Chandra Bose . There had been at least four known occasions when Gumnami Baba reportedly claimed he was Netaji Subhas Chandra Bose.

నేతాజీ సుభాష్ చంద్రబోసే... గుమ్నమి బాబా

Posted: 09/21/2015 08:36 AM IST
Gumnami baba or bhagwanji was netaji himself

నేతాజీ జీవితం ఒక సాహసమైతే...ఆయన మరణం ఒక సందేహం..! వాజ్ పేయ్  సర్కార్ ఏర్పాటు  చేసిన ముఖర్జీ కమిషన్ విస్మయం కలిగించే వాస్తవాలు కనుగొందా ? 1985 వరకు కూడా నేతాజీ మన మధ్యే ఉన్నారా...? నేతాజీ విమాన ప్రమాదం కట్టుకథేనా..?  అది అయోధ్య సమీపంలోని ఫైజాబాద్. ఇక్కడ ఓ బాబా వుండేవారు. అయితే ఆయన గురించి చాలా మందికి తెలియదు. కొంతమంది మాత్రం ఆయన్ను భగవాన్ జీ...అని మరికొందరు గుమ్నామీ బాబా అని పిలిచేవారు. ఈ బాబా 1985 సెప్టెంబర్ 16న ఆయన మరణించారు. అయితే అంతటితో బాబా కథ ముగిసిపోలేదు. 1945లో ఆగస్టులో 18న తైవాన్ లో జరిగిన విమాన  ప్రమాదంలోమరణించారని అంటున్న సుభాష్ చంద్రబోస్...ఈ గుమ్నామీ బాబా అని సందేహం.

వాజ్ పేయి ప్రభుత్వం నియమించిన ముఖర్జీ కమిషన్ తన నివేదికలో గుమ్నామీ బాబాయే నేతాజీగా పేర్కొందని అనేక కథనాలు వినిపించాయ్. గుమ్నామీ బాబా మరణించిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆయన ట్రంకు పెట్టెలను ఫైజాబాద్ లోని ట్రెజరీలో భద్రతపరిచారు. 2001లో జస్టిస్ ముఖర్జీ కమిషన్ స్వయంగా వెళ్లి ఆ ట్రంకు పెట్టెలను తెరిపించారు. అందులో నేతాజీ ధరించే బంగారు ఒమెగా చేతి గడియారం. కళ్లకు  అంటిపెట్టుకుని ఉండే గుండ్రటి కళ్ల జోడు కనిపించాయి. రవీంద్రనాథ్ ఠాగూరు, షేక్ స్పియర్ వంటి దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు రచించిన పుస్తకాలెన్నో బయటపడ్డాయి. దీంతో ఈ బాబా సామాన్యుడు కాదని అంతా అనుకున్నారు. కొన్నినోటుబుక్కుల్లో కనిపించిన రాతను నేతాజీ అక్షరాలతో పోల్చారు. ఆశ్చర్యం... రెండు చేతిరాతలు ఒక్కరివేనని బి.లాల్ కపూర్ అనే చేతిరాత నిపుణుడు తేల్చారు. అయితే ఆ పెట్టెల్లో బాబా ఫోటోలు లభ్యం కాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bose  Netaji  Bhagwanji  Gumnami Baba  Freedom Fighter  India  

Other Articles