The 14th anniversary of WTO attack

America nation set to remember 14th anniversary of wto attacks

9/11attacks, America, WTO, WTO Attack, Alkaida, ISIS

The 14th anniversary of America’s darkest hour will be solemnly marked Friday with church bells and thoughtful memorials to each victim of the Sept. 11, 2001, terrorist attacks.

ఆ ఒక్క రోజు 2792 మంది చనిపోయారు

Posted: 09/11/2015 01:08 PM IST
America nation set to remember 14th anniversary of wto attacks

మానవ జాతి చరిత్రలో చీకటి రోజు.. అలాంటి రోజంటూ తమ జీవితాల్లో ఉంటుందని కూడా ఎవరూ ఊహించలేదు. ఆ దాడి నిజానికి అమెరికా మీద చేసినా కానీ అది మానవజాతి మీద చేసిన దాడిగా అందరూ బావించారు. ఉగ్రవాదం అనే రాక్షసత్వానికి కళ్లారా కనిపించిన రక్తపాతమే.. 9/11 దాడులు. అమెరికాలోని డబ్లుటిఓ బిల్డింగ్ మీద చేసిన దాడులు ఇప్పటికే ఎంతో మందికి కన్నీటిని మిగిల్చాయి. గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కంట కన్నీరు తీస్తున్న ఎంతో మందికి సెప్టెంబర్ 11 అంటే గుండెల్లో రైలు పరుగెడతాయి.

పద్నాలుగేళ్లు గడిచినా ఆనాటి ఉగ్రవాద దాడుల్ని అమెరికా మరచిపోలేకపోతోంది. తిరిగి అలాంటి దాడి జరుగుతుందేమోనని భయపడుతోంది. న్యూయార్క్‌, వాషింగ్టన్‌, పెనిసిల్వేనియాల్లో జరిగిన సెప్టెంబర్‌ 11 నాటి దాడులకు నేటితో పద్నాలుగేళ్లు నిండాయి. ఆ దాడుల్లో మూడు వేల మందికి పైగా మరణించారు. ఆనాటి నుంచి అమెరికాను ఆ దుర్ఘటన పీడకలగా వెంటాడుతోంది. పదేళ్లుగా ఉగ్రవాదంపై పోరాడుతోంది. కానీ, ఇక్కడ ఓ విషయం గమనించాలి. భారతదేశం దాదాపు 30 ఏళ్లుగా ఆ నరకాన్ని అనుభవిస్తోంది. దాని నుంచి విముక్తి ఎప్పుడా అని ఎదురు చూస్తోంది. పోరాడుతోంది.

1985 జూన్‌ 23న ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ కనిష్కను ఉగ్రవాదులు పేల్చేశారు. ఘోరమైన ఆ దాడిలో 329 మంది భారతీయ ప్రయాణికులు మరణించారు. ఈ సంఘటన జరిగి ఇన్నేళ్లయినా ...ఆ ఘోరకృత్యం సాగించిన దుండగుల్ని పట్టుకోలేదు. ఇప్పటికీ కెనడా, అమెరికాల్లో యధేచ్ఛగా తిరుగుతున్నారు. ఇండియా విమానంపై దాడి జరిగినా అమెరికా పట్టించుకోలేదు. కానీ, కనిష్కపై జరిగిన దాడి లాంటిదే 2001 సెప్టెంబర్‌ 11న తన భూభాగంపై జరిగినప్పుడు వణికిపోయింది. గగ్గోలు పెట్టింది. ఉగ్రవాదంపై ‘అంతర్జాతీయంగా పోరాటం’ సాగించాలని (గ్లోబల్‌ వార్‌ ఆన్‌ టెర్రర్‌- జిడబ్ల్యూఓటి) పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 11, 2001న జరిగిన ఈ దాడికి 19 హైజాకర్స్ ప్రత్యక్ష కారణం. ఈ దాడి వల్ల చెలరేగిన మంటలు పూర్తిగా తగ్గిపోవడానికి 100 రోజుల వరకు పట్టిందని తెలుస్తోంది. ఈ దాడి ప్రపంచాన్నే వణికించింది.

ఒక్క రోజులో...
2001 సెప్టెంబర్‌ 11న న్యూయార్క్‌లో ప్రపంచ వాణిజ్య భవనాలపై ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఒకే ఒక్క రోజులో 2,792 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నిజమైన విషాదం అదే. వెలకట్టలేని నష్టమూ అదే.

అల్‌ఖైదా ఖతం కాలేదు
2001 సెప్టెంబర్‌ 11 దాడి తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌ ‘ఉగ్రవాదంపై అంతర్జాతీయ యుద్ధం’ ప్రకటించారు. బుష్‌ ప్రకటన అమెరికాకు, దాని మిత్రదేశాలకు ప్రతిష్టాత్మకంగా, సవాల్‌గా మారింది. అల్‌ఖైదాతో పోరులో తమదే విజయమన్న దిశగా ప్రచారం సాగించారు. అల్‌ఖైదా సీనియర్‌ నాయకుల్లో 75 శాతం మంది చంపడమో, పట్టుకోవడమో జరిగిందని అమెరికా, దాని మిత్రదేశాల నాయకులు ప్రకటించుకొన్నారు. తాజాగా యూనిస్‌ అల్‌ మౌరిటానియాను లక్ష్యంగా చేసుకొన్నామన్నారు. అమెరికాలోను, యూరప్‌లోను దాడులకు యూనిస్‌ ఆదేశాలిస్తున్నాడన్న అనుమానంతో ఈ నెల క్వెట్టా, పాకిస్థాన్‌లలో జరిపిన దాడుల్లో అతన్ని అరెస్ట్‌ చేశారు.

అయితే, ఇంత చేసినా...ఇంతమంది అల్‌ఖైదా సీనియర్‌ నాయకుల్ని పట్టుకొన్నా, హతమార్చినా .... ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థ చేస్తున్న దాడులు పెరిగాయే కానీ తగ్గలేదు. 2001 సెప్టెంబర్‌ 11 తర్వాత జరిగిన దాడుల సంఖ్యను గమనిస్తే ఈ వాస్తవం వెల్లడవుతుంది. మరీ తాజాగా ఈ నెల 7న క్వెట్టాలో బలూచిస్థాన్‌ ఫ్రాంటియర్‌ దళాల డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ నివాసాన్ని లక్ష్యంగా చేసుకొని, రెండు ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయి. ఆ దుర్ఘటనలో 24 మంది మరణించారు. యూనిస్‌ అల్‌ మౌరిటేనియా అరెస్ట్‌కు ప్రతీకారంగా అల్‌ఖైదా ఈ దాడికి పాల్పడింది.

ఏనాటిది ఈ అల్‌ఖైదా?
అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఉగ్రవాద సంస్థ ‘అల్‌ఖైదా’. అమెరికాలో శిక్షణ పొందిన సౌదీ అరేబియా వ్యక్తి ‘జిహాదీ’ దీన్ని స్థాపించాడు. 1993లో న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రం (వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ - డబ్ల్యూటిఓ) పై చిన్న దాడితో ఈ సంస్థ చరిత్ర ప్రారంభమైంది. ఆ తర్వాత 1998లో ఆఫ్రికాలోని అమెరికా రాయబార కార్యాలయాలు, 2000లో యుఎస్‌ఎస్‌ కోలే పైన దాడులు జరిపింది. ప్రతీకారంగా అమెరికా ఆఫ్గనిస్థాన్‌లోని అల్‌ఖైదా స్థావరాలపై క్షిపణి దాడులు జరిపింది. కానీ అది విఫల యత్నంగానే మిగిలిపోయింది.

అప్పుడు ఆల్ ఖాయిదా ఇప్పుడు ఐఎస్ఐఎస్..
పేరు ఏదైనా చేసేది మాత్రం రక్తపాతమే.. మనిషిని మనిషి చంపుకుంటూ పైశాచికత్వాన్ని ప్రదర్శించే బాటలో తాజాగా ఐఎస్ఐఎస్ చేరింది. ఆల్ ఖాయిదా కన్నా ప్రమాదకరంగా మారింది ఐఎస్ఐఎస్. గత వారం పది రోజుల నుండి లక్షల సంఖ్యలో  దేశీయులు విదేశాలకు వలస వెళుతున్నారు అంటే ఆ పాపం ఐఎస్ఐఎస్దే. ఎన్నో వేల మంది అమాయకుల ప్రాణాలను చిదిమేస్తూ తన రక్తదాహాన్ని చాటుకుంటోంది ఐఎస్ఐఎస్. అప్పుడంటే అమెరికా మీద ఆల్ ఖాయిదా  దాడికి ప్రతీకారంగా దాని రూపుల రేఖలు లేకుండా చెయ్యాలని యుద్ధానికి దిగింది అమెరికాకు అవసరం కాబట్టి అలా చేసింది కానీ ఇప్పుడున్న ఐఎస్ఐఎస్ అంతకన్నా ప్రమాదకరమైంది. అన్ని దేశాలు మూకుమ్మడిగా ఐఎస్ఐఎస్ మీద, ఉగ్రవాదం మీద పోరాడకపోతే మరో 9/11 దాడి జరగదు అని ఏ గ్యారెంటీ లేదు. ఇప్పటికైనా అన్ని దేశాలు కలిసికట్టుగా ఉగ్రవాదం మీద సమరశంఖం పూరించాలి.

*అభినవచారి*
(Inputs: Suryaa)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 9/11attacks  America  WTO  WTO Attack  Alkaida  ISIS  

Other Articles