టీడీపీ అంటే.. తెలంగాణ డెవలప్ మెంట్ పార్టీ అని తెలంగాణ టిడిపి నేత, ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడు రేవంత్ రెడ్డి కొత్త అబ్రివేషన్ చెప్పారు. తెలంగాణలో భవిష్యత్ అంతా టీడీపీదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనపై పెట్టిన కేసులను రాజకీయంగానే ఎదుర్కొంటానని రేవంత్ స్పష్టం చేశారు. హైకోర్టు అనుమతితో హైదరాబాద్ కు వచ్చిన రేవంత్ రెడ్డి.. ఎక్స్ ప్రెస్ టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడారు. ఇక టీఆర్ ఎస్ పార్టీపైనా, సీఎం కేసీఆర్ పైనా మరోసారి ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. హవాలా కేసులో కొంతమంది టీఆర్ ఎస్ నేతలున్నారంటూ ఆయన ఆరోపించారు. తనకో చట్టం, వారికో చట్టం వర్తించదన్నారు.
కొడుకు, కూతురు, అల్లుడు దెబ్బకు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తనకు కేసులు కొత్తవి కాదన్న ఆయన.. తనపై పెట్టిన కేసులన్నీ రాజకీయాంగానే ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. ఇక పార్టీలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలన్నది చంద్రబాబుకి బాగా తెలుసు అని రేవంత్ వెల్లడించారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ మరింత బలపడుతుందన్నారాయన. తనకు ఏ పదవి ఇవ్వాలి, ఎలా పని చేయించుకోవాలి అన్నది అధినేతకు బాగా తెలుసున్నారు రేవంత్. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి అందరం కలిసి పోరాడాలన్నారు. ఒక్కడి వల్లే సాధ్యం కావడానికి ఇది సినిమా కాదన్నారాయన. 2017లోనే ఎన్నికలు వస్తాయని, టీడీపీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
May 19 | పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అంటూ ఎవర్వైనా తమ పెళ్లి అనగానే ఆ రోజున ఎంతో ఆనందంగా ఉంటూ.. అహ్లాదకరంగా గడపుతారు.... Read more
May 19 | ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినా ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. ఇక ప్రేమ కలిగిన తర్వాత అబ్బాయి, తన ప్రేమను అమ్మాయికి తెలుపడానికి నానా తిప్పలు పడుతుంటాడు. ఎలా తనలో... Read more
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more