withdraw cash from banks

Hardik patel calls for draw amount in the bank accounts

hardik Patel, Financial Cooperation, Gujarat, Reservation, Banks, Amount, Withdraw

Hardik Patel calls for draw amount in the bank accounts. Hardik patel call to Financial Cooperation by the patel community.

బ్యాంకుల్లో ఎవరూ డబ్బులు పెట్టకండి..!

Posted: 09/10/2015 02:57 PM IST
Hardik patel calls for draw amount in the bank accounts

సంపాదించిన మొత్తంలో ఎంతో కొంత మొత్తాన్ని దాచుకోవడం అందునా బ్యాంకుల్లో దాచుకోవడం అలవాటు. కానీ అయ్యా మీరెవరూ డబ్బులను బ్యాంకుల్లో దాచుకోకండి. వెంటనే బ్యాంకుల్లో ఉన్న మీ డబ్బులను డ్రా చెయ్యండి అంటూ హితవు పలుకుతున్నారు. ఇంతకీ అంతలా బ్యాంకుల్లో డబ్బులు డ్రా చెయ్యాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..? ఎవరికి వచ్చింది..? అసలు ఇలా చెయ్యమని ఎవరు పిలుపునిచ్చారో తెలుసా...? గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్ కల్పిస్తూ వారిని ఓబీసీలుగా చేర్చాలని డిమాండ్ తో ఉద్యమం చేస్తున్న హార్దిక్ పాటిల్. హార్దిక్ పాటిల్ తాజాగా బ్యాంకుల మీద పడ్డారు. పటేళ్లు ఎవరూ కూడా బ్యాంకుల్లో డబ్బులు ఉంచుకోవద్దని వాటిని డ్రా చేసుకోవాలని, ఆర్థిక లావాదేవీలను వెంటనే ఆపివెయ్యాలని పిలుపునిచ్చారు.

హర్దిక్ పాటిల్. పటేల్ సామాజిక వర్గానికి నేతృత్వం వహిస్తూ రిజర్వేషన్ల పుట్టను కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. గుజరాత్ లో పటేళ్ల వర్గాన్ని ఏకం చెయ్యడమే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో ఉంటున్న ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నత వర్గాలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వాలకు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. స్వతంత్ర ఉద్యమ సమయంలో గాంధీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణ తరహాలో కొత్త ఉద్యమానికి ఊపిరిపోశారు. తాజాగా తీసుకున్న ఆర్థిక సహాయ నిరాకరణ మీద సర్వత్రా చర్చ సాగుతోంది. గుజరాత్ రాష్ట్రంతో పాటు మిలిగిన రాష్ట్రాలు, ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి పటేల్ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు నిజంగా ఆర్థిక సహాయ నిరాకరణను ఖచ్చితంగా పాటిస్తే దేశంలో కొత్త సంక్షోభానికి తెర లేస్తుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hardik Patel  Financial Cooperation  Gujarat  Reservation  Banks  Amount  Withdraw  

Other Articles