West Bengal: Braveheart teaches a tough lesson to her molesters

16 years old girl practices martial arts lessons on molesters

molestation, west bengal, girl, crime, accused, victim, police, barasat, kolkata, women safety, martial arts, karate, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

a 16-year old braveheart taught her molesters a tough lesson in Madhyamgram city of West Bengal.

కామాంధులపై కరాటే పంచులు.. దెబ్బలకు తాళలేక పరుగులు

Posted: 09/08/2015 10:21 PM IST
16 years old girl practices martial arts lessons on molesters

అది పశ్చిమ బెంగాల్. అందులోనూ మహానగరి కోల్ కతా శివారు ప్రాంతం. ఓ పదహారు ఏళ్ల అమ్మాయి ఎక్కడి నుంచి ఇంటికి వెళ్తోంది. ఆసలే అ ప్రాంతం నిత్యం వార్తల్లో వుంటుంది. మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారిన ప్రాంతమది. రాత్రి అయితే చాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా ఆడవారు భయపడతారు. ఎప్పుడు ఏవరో ఒకరు వస్తారుగా అనుకుంటూ మహిళల కోసం ఎదురుచూసే మగమృగాళ్లు అక్కడ నిత్యం పోంచివుంటారు. ఒంటరిగా ఆడవారు కనబడితే.. కామంతో విరుచుకుపడతారు.

అలాంటి ప్రాంతంలో ఒంటరి ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళ్లే సరికి ఆ అమ్మాయిపై కామాంధుల కన్ను పడింది. నడుస్తూ వెళ్లున్న బాలికను సైకిళ్లపై వచ్చిన కామాంధులు అడ్డగించారు. ఆమెపై అత్యాచారం చేయబోయారు. అంతే ఆ పిల్ల కాస్తా అపర కాళీగా మారిపోయింది. పిల్ల కోంచెం గట్టిదంటూ రెచ్చిపోబోయిన కామాంధులకు ఊహించిన రీతిలో విందు బోజనం పెట్టింది బాలిక. అదేంటి అంటారా..? తనకు తెలిసిన కరాటే పంచ్‌లతో వారి ముఖంపై పిడి గుద్దులు కురిపించింది. ఆమె పంచ్‌లకు తాళలేక వారిద్దరు పరుగులంకించుకున్నారు. ఇలా ఇద్దరు తాగుబోతు కామాంధులకు తన కారాటేతో బుద్ధి చెప్పింది ఆ బాలిక.

తల్లిదండ్రులు కాదన్నా ఇష్టంతో నేర్చుకున్న కరాటేనే ఆమె మాన ప్రాణాలను కాపాడింది. కరాటే క్లాస్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న ఆ బాలికను సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు తాగుబోతులు అడ్డగించారు. ఆమెను పట్టుకోబోగా వారి ముఖంపై కరాటే పంచ్‌లు విరిసింది. ఊహించని ఈ పరిణామానికి వారిద్దరు బిత్తరపోయారు. తిరిగి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈసారి మరింత బలంగా వారి ముఖంపై పంచ్‌లు విసిరింది. దీంతో రక్త గాయాలతో వారు కుప్పకూలిపోయారు. మెల్లగా లేచి సైకిల్ ఎక్కి అక్కడి నుంచి జారుకున్నారు. దారిన పోయే వారు ఆ బాలిక సాహసానికి ఆశ్చర్యపోయారు. అనంతరం జరిగిన దానిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. స్థానికులైన ఆ ఇద్దరు కామాంధుల కోసం గాలిస్తున్నారు. కరాటే విద్యనే తనకు శ్రీరామ రక్షగా నిలిచిందని ఆ బాలిక ఎంతో ధైర్యంతో చెబుతోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : barasat  kolkata  women safety  martial arts  karate  molestation  

Other Articles