Chandrababu Government Introducing New Bonds Scheme To Gain Funds For Capital City Amaravathi | Andhra Pradesh State Issues

Chandrababu government new bonds scheme for capital amaravathi

chandrababu naidu, ap capital city, capital city amaravathi, amaravathi funds, babu govt funds, amaravathi latest updates, amaravathi news, amaravathi schemes, ap government schemes, tdp government new schemes, bonds scheme for amaravathi

Chandrababu Government New Bonds Scheme For Capital Amaravathi : Chandrababu Government Introducing New Bonds Scheme To Gain Funds For Capital City Amaravathi.

‘అమరావతి’ కోసం చంద్రబాబు కొత్త ‘వ్యూహం’

Posted: 09/08/2015 09:51 AM IST
Chandrababu government new bonds scheme for capital amaravathi

విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. నిధులను రాబట్టేందుకు రకరకాల ప్రయాత్నాలు చేస్తోంది. ముఖ్యంగా రాజధాని ‘అమరావతి’ నిర్మాణం కోసం బాబు సర్కారు ఓ సరికొత్త వ్యూహాన్ని ప్రవేశపెట్టనుంది. ఆ రాజధాని ప్రాంత నిధులను సమీకరించేందుకు ‘పన్ను రహిత బాండ్ల’ను జారీ చేసేందుకు ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై సీఎం నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో రెండుసార్లు చర్చించారు కూడా. ఆ బాండ్లను ‘అమరావతి మౌలిక వసతుల కల్పన’ పేరిట విడుదల చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీయే) ప్రతిపాదించింది.

అమరావతి నిర్మాణం నిమిత్తం వచ్చే పదేళ్లలోరూ. 53,547 కోట్లు అవసరమని అంచనా వేసింది. నిజానికి.. అంచనా వేసిన మొత్తంలో కొంత భాగం కేంద్రం నుంచి గ్రాంట్ రూపంలో చేసినప్పటికీ.. మిగిలిన మొత్తాన్ని సమీకరించాల్సి వుంటుందని సీఆర్డీయే సమావేశంలో ఇటీవల సీఎం అభిప్రాయపడ్డారు. ఈ అమరావతిపై ప్రజల్లో సెంటిమెంట్ వుంది కాబట్టి.. అదే పేరుతో వడ్డీపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేని బాండ్లను జారీ చేయాలని సీఆర్డీయే నిర్ణయించింది. అయితే.. ఇందుకు సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నుంచి అనుమతులు తీసుకోవాల్సి వుంది. బాండ్ల జారీకి విధివిధానాల ఖరారు చేయడానికి ఓ కన్సల్టెంట్ ను నియమించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

ఇక ఈ బాండ్లను కొనుగోలు చేసే ప్రజలకు, తమ పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాల్సి వుంటుంది. వీటిని ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం పన్ను పరిధి నుంచి తొలగిస్తారు. అయితే, పన్ను రాయితీలు కేవలం పెట్టుబడులపైనేనా? లేక దానిపై వడ్డీలు తదితరాల రూపంలో వచ్చే ఆదాయంపై కూడానా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి వుంది. ఈ విషయంలో మరిన్ని వివరాలు, ఇతర నిధుల సమీకరణ యత్నాలపై ప్రణాళికల నిమిత్తం ఆర్థిక శాఖ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్ కు చంద్రబాబు సూనలు చేసినట్టు తెలుస్తోంది. మరి.. ఈ కొత్త వ్యూహానికి ప్రజలకు ‘ఊ కొడతారో.. ఉలిక్కిపడతారో’ వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles