three members committee held on narayana college students suicide

Ganta srinivasa rao lashes out on ys jagan

ganta srinivasa rao lashes out on ys jagan, ganta on students suicide, ganta srinivasa rao on kadapa students suicide, Ganta srinivasa Rao, three member committee, narayana collage, girls suicide case, kadapa, ganta appoints 3 member committee

andhra pradesh minister ganta srinivasa rao lashes out on leader of opposition ys jagan, who is using students suicide case for political milage

వైసీపీపై మండిపడ్డ గంటా.. విద్యార్థినుల ఆత్మహత్యలపై త్రిసబ్య కమిటీ

Posted: 08/18/2015 09:58 PM IST
Ganta srinivasa rao lashes out on ys jagan

కడప జిల్లాలో నారాయణ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యల ఘటనకు సంబంధించి త్రిసభ్య కమిటీని నియమిస్తూ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ పూర్తి చేసి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని గంటా తన తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. కమిటీ సభ్యులుగా పద్మావతి యూనివర్శిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్  కంట్రోలర్ మాణిక్యం, కడప డీఆర్వోలను ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీలో నియమించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో గంటా ఫోన్ చేసి ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కడప నగర శివార్లలోని చింతకొమ్మదిన్నెలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదవుతున్న ఇద్దరు విద్యార్థినిలు సోమవారం సాయంత్రం ఒకే గదిలో వేర్వేరు ఫ్యాన్లకు తమ చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థుల మృతిపై విపక్ష్ నేత జగన్ శవ రాజకీయం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కడపలో విద్యార్థుల మృతిపై విచారణకు ఆదేశించామని మంత్రి తెలిపారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని గంటా చెప్పారు. విద్యార్థుల మృతిని కూడా రాజకీయం చేయాలనుకోవడం జగన్ అవగాహనరాహిత్యానిెకి నిదర్శమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలేవి లేకపోవడంతో జగన్ ఈ పోకడలకు తెర లేపుతున్నారని గంటా అన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్‌ ఘటనలను ఉపేక్షించేదిలేదని మంత్రి స్పష్టం చేశారు.

 అయితే ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 5వ తేదీలోగా ఖాళీగా ఉన్న వీసీ పోస్టులు భర్తీ చేస్తామని గంటా తెలిపారు. అక్టోబర్ 15వ తేదీన ప్రతిభా అవార్డుల ప్రదానం చేస్తామన్నారు. సెప్టెంబర్ 5 వ తేదీన గురుపూజోత్సవంను విశాఖలో జరుపుతున్నామన్నారు. తెలుగు యూనివర్శిటీ, అంబేద్కర్ యూనివర్శిటీ వివాదంపై కోర్టుకు వెళ్లే ఆలోచలనలో ఉన్నామని గంటా తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles