AAP MLA Alka Lamba attacked, receives head injury; Kejriwal tweets 'proud of you'

Aap leader alka lamba attacked

Alka Lamba, Aam Aadmi Party, AAP MLA, Anti drug-drive, Arvind Kejriwal, Ashutosh, Lamba head injuries, BJP MLA Om Prakash Sharma, Alka Lamba,Aam Aadmi Party,AAP leader,AAP MLA,Kashmere Gate

Alka Lamba, Aam Aadmi Party (AAP) MLA from Chandni Chowk, was on Sunday morning was attacked by some unidentified people at Rajghat while she was leading an anti drug-drive.

అప్ ఎమ్మెల్యే ర్యాలీపై దుండగుల రాళ్ల దాడి.. ఎమ్మెల్యే తలకు గాయాలు..

Posted: 08/09/2015 12:35 PM IST
Aap leader alka lamba attacked

ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నాయకురాలు, చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. మాదక ద్రవ్యాల్ని నిరోధించాలని పిలుపునిస్తూ ఆదివారం ఉదయం ఎమ్మెల్యే చేపట్టిన ప్రత్యేక ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీ.. ఉత్తర ఢిల్లీలోని కశ్మీరీ గేట్ ప్రాంతానికి చేరుకోగానే గుర్తుతెలియని దుండగులు ఎమ్మెల్యే అల్కా సహా ఆమె అనుచరులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో అల్కా తలకు బలమైన గాయం కాగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

వేగంగా స్పందించిన కార్యకర్తలు అల్కాను హుటాహుటిన అరుణా అసఫ్ అలీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం కొద్దిసేపటికి ఆమె డిశ్చార్జి అయ్యారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తనపై దాడి చేశారని, తన  తల పగలగొట్టారని... రక్తం కళ్లజూశారని... అయినాసరే వెనకడుగు వేసేదిలేదని అమె ట్విట్ చేశారు. మత్తులో జోగుతూ తమ జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్న యువతను జాగృతం చేసేవరకు పోరాడుతూనే ఉంటనంటూ దాడి అనంతరం అల్కా ట్వీట్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP Mla  Alka Lamba  attack  head injury  

Other Articles