Tapping | Chandrababu Naidu | NaraLokesh | nara Brahmani

Telangana govt tapped nara lokesh and nara brahmini and many other phones

Tapping, AP, Telangana, Chandrababu Naidu, NaraLokesh, nara Brahmani, Phone Tapping

Telangana govt tapped Nara LOkesh and Nara Brahmini and many other phones. AP govt got some major evidence about the Telangana govt phone tapping issue.

నారా లోకేష్, బ్రాహ్మణి ఫోన్లను కూడా ట్యాప్ చేశారు

Posted: 08/07/2015 09:05 AM IST
Telangana govt tapped nara lokesh and nara brahmini and many other phones

టీవీలొ వచ్చే సీరియల్ లా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం అంతకంతకూ పెరుగుతోంది. కేంద్రం, గవర్నర్ ఎంతలా సర్దుమణచాలని చూసినా ఎలాంటి ఫలితాలు రావడం లేదు. తాజాగా ట్యాపింగ్ లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం కేవలం చంద్రబాబు, ముఖ్యఅధికారుల ఫోన్లనే కాకుండా... సచివాలయ సిబ్బంది, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఫోన్ నెంబర్లను కూడా ట్యాప్ చేసినట్లు ఏపి భావిస్తోంది. అందుకు తగ్గ ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని అంటోంది. నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఫోన్ లను కూడా తెలంగాణ సర్కార్ ట్యాప్ చేసిందన్న వాదన తాజా వివాదానికి కారణమైంది.

Also Read : ఫోన్ ట్యాపింగ్ ఒప్పుకున్న కేసీఆర్ రాజీనామా చెయ్యాలి

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న సింగపూర్‌, జపాన్‌ ప్రతినిధుల మాటలను, ఏపీ ప్రభుత్వ ముఖ్యుల కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంభాషణలనూ తెలంగాణ నిఘా వర్గాలు ట్యాపింగ్‌ ద్వారా విన్నట్లు ఏపీ పోలీసులు పేర్కొంటున్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ తన జీవిత భాగస్వామి నారా బ్రాహ్మణితో ఫోన్‌ సంబాషణలను సైతం ట్యాపింగ్‌ ద్వారా తెలుసుకున్నారని అనుమానిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యు ల వ్యాపార, వ్యక్తిగత విషయాలనూ తెలంగాణ పోలీసులు ట్యాపింగ్‌ ద్వారా తెలుసుకున్నట్లు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ బృం దం నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి హైకోర్టులో దాఖలు చేయనున్న కౌంటర్‌ పిటిషన్‌లో ఈ అంశాలన్నీ పొందుపరచనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also Read :  ‘ఫోన్ ట్యాపింగ్’లో అడ్డంగా బుక్కైన కేసీఆర్..?
 
ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం నుంచి సింగపూర్‌, జపాన్‌ తదితర దేశాల్లోని పారిశ్రామికవేత్తలకు వెళ్లిన ఫోన్లను సైతం తెలంగాణ నిఘా వర్గాలు ట్యాప్‌ చేసినట్లు ఆధారాలు సేకరించినట్లు సమాచారం. రెండో జాబితాలో చంద్రబాబు కుటుంబ సభ్యుల ఫోన్‌ నెంబర్లు సైతం ఉన్నాయని తెలుస్తోంది. చంద్రబాబు కుమారుడు, కోడలు ఫోన్లను సైతం హైదరాబాద్‌లో ట్యాప్‌ చేసినట్లు ఏపీ పోలీసులకు ఆధారాలు లభించాయని తెలుస్తోంది. సుప్రీంలో టెలికమ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు చుక్కెదురవడంతో... తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. చట్టపరంగానే ట్యాపింగ్‌ చేసినట్లు టీ న్యాయవాదులు అందులో పేర్కొన్నారు. వారి వాదన ప్రకారం చూసినా... టెలిగ్రాఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 52 ఆధారంగా దేశ భద్రత, శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్య క్తుల ఫోన్లు ట్యాపింగ్‌ చేయవచ్చు. అదీ కొన్ని షరతులకు లోబడి హోంశాఖ కార్యదర్శి స్థాయి అధికారి నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకొని ట్యాపింగ్‌ చేయాలి. కానీ... ఇక్కడ ట్యాప్‌ అయినట్లుగా భావిస్తున్న నెంబర్ల జాబితాలోని అధికారులు, మంత్రులు, చంద్రబాబు కుటుంబ సభ్యులెవరూ సెక్షన్‌ 52లో పేర్కొన్న వ్యక్తుల జాబితాలోకిరారు. అలాంటప్పుడు చట్టపరంగానే ట్యాప్‌ చేసినట్లు ఎలా చెబుతున్నారనేది ఏపీ పోలీసుల ప్రశ్న. తాము అందజేసిన జాబితాలోని 25 మందికి ఈ చట్టం ఎలా వర్తిస్తుందో నిరూపించగలిగితేనే కోర్టులో తెలంగాణ వాదన నిలుస్తుందని వీరంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tapping  AP  Telangana  Chandrababu Naidu  NaraLokesh  nara Brahmani  Phone Tapping  

Other Articles