Gold rate | gold Price | 25 Thousand

Gold price mark 25thousand below in india

Gold, Gold Price, Bullion Market, Gold Rate in India, Gold rate today, 25 Thousand

Gold price mark 25thousand below in india. By the International market and china gold production, gold prices reducing in india. Ater four years gold price hit below 25 thousand mark.

బంగారం ధర 25వేల కంటే తక్కువ

Posted: 08/07/2015 10:23 AM IST
Gold price mark 25thousand below in india

అంచనాలు నిజమవుతున్నాయి. బంగారం నిజంగానే నేల చూపులు చూస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. నాలుగేళ్ల కనిష్ఠానికి పసిడి ధరలు పతనమయ్యాయి. 10 గ్రాముల బంగారం 25 వేల లోపు మార్కుకు చేరింది. డాలర్ బలపడడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చర్యలతో భవిష్యత్ లో మార్పులు ఉంటాయన్న సెంటిమెంట్ తో ప్రపంచవ్యాపంగా బంగారానికి డిమాండ్ తగ్గిపోతోంది. గతంలో అంచనా వేసినట్లే.. బంగారం ధర మరింత తగ్గిపోయింది. పసిడి వెలుగులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు 10 గ్రాముల బంగారం ధర 30 వేల రూపాయల పైమాటే. కానీ మారిన మార్కెట్ పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా పసిడి నేలచూపులు చూస్తోంది. వరుసగా ధరలు పతనమవుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లే... భారత్ లో ఏకంగా పది గ్రాముల పచ్చలోహం ధర 25 వేల మార్కు దిగువకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. నిన్నటి లెక్క ప్రకారం.. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం.. ఢిల్లీలో 24 వేల 980 రూపాయలు పలికింది.

2011, ఆగస్టు 6న 24 వేల 980 రూపాయలు ధర పలికిన బంగారం.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అదే స్థాయికి దిగజారింది. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ పుంజుకోవడంతో మదుపుదారులు తమ పెట్టుబడి మార్గాన్ని మళ్లించడం పసిడి పతనానికి కారణమవుతోంది. మార్కెట్లు అనిశ్చితి ఉన్న సమయంలో పెట్టుబడి దారులు సాధారణంగా పసిడికే ప్రాధాన్యం ఇస్తారు. కానీ కాలం కలిసి వస్తే ప్రత్యామ్నాయాలవైపూ మళ్లుతారు. తాజాగా జరుగుతోంది కూడా అదే. అందుకే ఆకాశంలో ఉండే బంగారం ధరలు ప్రస్తుతం నేల చూపులు చూస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold  Gold Price  Bullion Market  Gold Rate in India  Gold rate today  25 Thousand  

Other Articles