life threat to mro vanajakshi, receives warning letter from unknown persons

Warning letter to mro vanajakshi

Vanajakshi, Musunuru MRO Vanajakshi warning letter, Vanajakshi warning letter, Warning letter to MRO Vanajakshi, Mandal magistrate, Mandal revenue officer, Musunuru, TDP, Warning letter

Musunuru MRO Vanajakshi received a warning letter from an unknown person, saying to quit her job and Musunuru in 10 days.

పదిరోజుల్లో బదిలి కావాలి. లేదంటే.. మీరు వుండరు.. వనజాక్షికి బెదిరింపు లేఖ

Posted: 08/04/2015 01:28 PM IST
Warning letter to mro vanajakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులందరినీ ఏకం చేసి అందరూ ఒక్కటిగా ఏకతాటిపైకి వచ్చిన ఉద్యమించే దిశగా ప్రేరేపించిన సంఘటన ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి ఘటన. ఎమ్మార్వో వనజాక్షి ఘటన. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాక్షిగా అయన అనుఛరులు అమెతో పాటు మండల రెవెన్యూ ఉధ్యోగులపై దాడికి పాల్పడటంతో రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులందరూ.. ఏకమై విధులను బహిష్కరించారు. అయితే ప్రభుత్వాధినేత చోరవతో ఉద్యోగులు విధులకు హాజరై తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్న క్రమంలో మరో కలకలం రేగింది.

ముసునూరు ఎమ్మార్వో వనజాక్షికి చంపేస్తామంటూ.. ఆగంతకుల నుంచి బెదిరింపు లేఖ అందింది. పది రోజుల్లో ఉరు విడిచి వెళ్లాలని, ముసునూను నుంచి బదిలీ కావాలని.. లేకుంటే చంపేస్తాం అంటూ ఆగంతకుల బెదిరింపు లేఖ సారాంశం. ఇప్పటికే ఆమెను హతమార్చేందుకు రెండు పర్యాయాలు రెక్కీ నిర్వహించామని కూడా ఆగంతకులు లేఖలో పేర్కోన్నారు. మీ భర్త, పిల్లల్ని వదిల మిమ్మల్ని చంపడానికి ప్లాన్ సిద్దం చేశామని ఆగంతకులు పేర్కోన్నారు. అందుకోసం ఇసుక రీచ్ లో గోడవ జరిగిన 8వ రోజే మిమ్మల్ని చంపమని మాకు సుఫారీ ఇచ్చారని లేఖలో ఆగంతకులు పేర్కోన్నారు. దాంతో వనజాక్షి ముసునూరు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vanajakshi  Mandal magistrate  Mandal revenue officer  Musunuru  TDP  Warning letter  

Other Articles