Loud music played at Salman Khan's sister Arpita's birthday bash, organiser fined

Salman khan s special birthday party for arpita khan disrupted by the police

aayush sharma, arpita khan, arpita khan birthday party, salman khan, salman khan party, salman khan sister arpita khan, salman khan sister arpita khan birthday, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news, polavaram, national news, telugu news

Salman Khan threw a special birthday bash for his baby sister last night but turns out that the police played a wet blanket.

సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత నివాసంపై పోలీసులు దాడి.

Posted: 08/02/2015 08:33 PM IST
Salman khan s special birthday party for arpita khan disrupted by the police

బాలీవుడ్ ప్రముఖ హీరో, కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు మరోమారు వార్తల్లో వ్యక్తిగా మారాడు. ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమెన్ ను ఉరి తీయవద్దని, ఆయన అమాయకుడని ట్విట్ చేసి.. దేశ ప్రజలతో పాటు కన్నతండ్రి ఆగ్హానికి గురైన సల్మాన్ ఖాన్.. తాజాగా ఆయన సోదరి అర్పితతో వార్తల్లోని వ్యక్తిగా మారాడు. అర్పిత నివాసంపై ముంబై పోలీసులు దాడులు చేశారు. ఎందుకంటారా..? తమ నిద్ర చెడగొడుతూ.. చెవులు చిల్లులు పడేలా.. భారీ సౌండ్ సెట్టింగ్స్‌తో పార్టీ ఏర్పాటు చేశారని ఇరుగు పొరుగువారు ఇచ్చిన ఫిర్యాదుతో ఖార్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది దాడులు చేశారు.

పాలీ హిల్ ప్రాంతంలో ఉన్న అర్పిత నివాసానికి చేరుకున్న పోలీసులు మ్యూజిక్ ఆపుజేయించారు. అర్పిత పుట్టినరోజు కారణంగా ఈ పార్టీ పెట్టుకున్నట్టు తెలిసింది. సమీపాన ఉన్న పసిఫిక్ హైట్స్ అపార్ట్‌మెంట్ వాసులు శనివారం అర్థరాత్రి దాటాక చేసిన ఫిర్యాదుతో రాత్రి 2.30 గంటల సమయంలో పోలీసులు వచ్చి షాక్ ఇచ్చారు. అక్కడ మ్యూజిక్ ఏర్పాట్లు చేసిన సంతోష్ మనే అనే వ్యక్తికి రూ.12,500 జరిమానా విధించి సౌండ్ సిస్టమ్‌ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర పోలీస్ చట్టంలోని సెక్షన్ 33(ఆర్)(3)కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే బహిరంగ ప్రదేశాల్లో మ్యూజిక్ ప్లే చేసుకోవాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arpita khan  arpita khan birthday party  salman khan  police  

Other Articles