farmers | Suicide | Union minister | agriculture

Drugs and love affairs behind farmer suicides said union minister

farmers, Suicide, Union minister, agriculture

Drugs and love affairs behind farmer suicides said Union Minister. Union Agriculture Minister Radha Mohan Singh on Friday told the Rajya Sabha that it was dowry, love affairs or impotency that caused the death of over 1400 farmers in India this year, and not financial stress because of debt or bad agricultural output.

లవ్ ఎఫైర్ వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి

Posted: 07/24/2015 04:36 PM IST
Drugs and love affairs behind farmer suicides said union minister

బారతదేశంలో రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ అన్నదాతలు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని అందరికి తెలుసు. అయితే ఓ మంత్రి గారు అది కూడా కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ మాత్రం దేశంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో వింటే అవాక్కవుతారు. అవును ఆయన గారి ప్రకారం డ్రగ్స్, లవ్ ఎపైర్స్, పిల్లలు పుట్టక పోవడంతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మంత్రిగారు శెలవిచ్చారు. అయితే అది కూడా ఏదో సభలో అలా అనుకోకుండా అన్నారు అంటే అదీ కాదాయె... మంత్రి గారు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. రాజ్యసభలో మంత్రిగారి నిర్వాకంతో దేశం మొత్తం విస్తుపోతోంది. రైతు ఆత్మహత్యల మీద బాధ్యత కలిగిన మంత్రిగా మాట్లాడాల్సిన వారే ఇలా చెత్త కారణాలు చెప్పడం నిజంగా సిగ్గుచేటు.

ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల మీద ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పేట్ పరిచి మరీ స్వాగతం పలికే ప్రభుత్వ యంత్రాంగం.. అన్నం పెడుతున్న అన్నదాతల ఆత్మహత్యల మీద మాత్రం పెద్దగా స్పందించకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఆరుకాలాలు కష్టించే అన్నదాత కష్టాన్ని గుర్తించడం మాట అటుంచి.. అన్నం పెట్టే అన్నదాతలే ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రి గారు మాత్రం వాటికి వేరే కారణాలు ఉన్నాయంటూ చెత్త కారణాలను ఎత్తి చూపడం నిజంగా సిగ్గు చేటు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది.. లవ్ ఎపైర్ వల్ల అంటూ వ్యాఖ్యానించడం చాలా దురదృష్టం. ఈ మాటలు విన్నాయంటే రైతుల ఆత్మలు ఘోషిస్తాయి.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : farmers  Suicide  Union minister  agriculture  

Other Articles