India makes 271-8 against Zimbabwe in 2nd ODI

India vs zimbabwe 2nd odi live vijay rahane take ind to 271 8

ambati rayudu, india, murali vijay, akinya rahane, india tour of zimbabwe 2015, Team india, Stuart Binny, rayudu and binny partnership, india vs zimbabwe, india vs zimbabwe 2015, zimbabwe, zimbabwe vs india, zimbabwe vs india 2015, ind vs zim, ind vs zim 2015, Ambati Rayudu, Elton Chigumbura, Stuart Binny, Zimbabwe, Zimbabwe vs India, Zimbabwe vs India 2015

Stand-in captain Ajinkya Rahane and Murali Vijay made half-centuries in a 112-run opening stand to send India to 271-8 batting first against Zimbabwe in the second one-day international

జింబాబ్వేకు 272 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించిన టీమిండియా

Posted: 07/12/2015 04:57 PM IST
India vs zimbabwe 2nd odi live vijay rahane take ind to 271 8

జింబాబ్వేతో జరుగుతున్న రెండోవన్డే మ్యాచ్ లో టీమిండియా.. అతిధ్య జట్టు ముందు 272 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. నిర్ణీత యాభై ఓవర్లలో టీమిండియా ఎనమిది విక్కెట్ల నష్టానికి 271 పరుగులు సాధించింది. టీమిండియా కెప్టెప్ అజింక్యా రహేనే.. సహా మురళి విజయ్ లు అద్భుతంగా రాణించి హాఫ్ సెంచరీలతో రాణించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే.. టీమిండియాను బ్యాటింగ్ బరిలోకి దింపింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఒపెనర్లు రహానే, మురళీ విజయ్ 112 పరుగుల వరకు విక్కెట్ కోల్పోకుండా శుభారాంబాన్ని ఇచ్చారు. 112 పరుగుల వద్ద కెప్టెన్ రహానే 63 పరుగుల వ్యక్తిగత స్కోర్కు వద్ద అవుట్ అయ్యి పెవీలియన్ కు చేరుకున్నాడు.

ఆ తరువాత బరిలోకి వచ్చిన అంబటి రాయుడుతో కలసి మురళీ విజయ్ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలో 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మురళీ విజయ్ కూడా వెనుదిరిగాడు. తొలి వన్డేలో శతకాన్ని బాదిన తెలుగు తేజం అంబటి రాయుడు ఈ మ్యాచ్ లోనూ 41 పరుగులు సాధించి ఔటయ్యాడు. ఆ తరువాత భారత్ క్రమంగా విక్కెట్లను కోల్పయింది. మనోజ్ తివారీ 22 పరుగులు, రాబిన్ ఉత్తప్ప 13 పరుగులు, కెదర్ జాదవ్ 16 పరుగులతో వెనుదిరిగారు. తొలివన్డేలో అంబటిరాయుడితో జతకట్టి రాణించిన స్టువర్ట్ బిన్నీ కూడా 25 పరుగులకే వెనుదిరిగాడు.

దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి హర్భజన్ సింగ్ ఐదు పరుగులతో, భువనేశ్వర్ కుమార్ ఖాతా తెరవకుండా.. నాటౌట్ గా క్రీజ్ లో వున్నారు. మొత్తానికి ఎనిమిది వికెట్లను కోల్పయిన టీమిండియా 271 పరుగులు సాధించింది.  జింబాబ్వే జట్టులో మజ్దీవా తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్ తో రాణించాడు. 49 పరుగులిచ్చి నాలుగు వికెట్లను పడగోట్టాడు.  డోనాల్డ్ తిరిపానో, చమ్ము చిబ్బాబ్బ, బ్రాయన్ విటోరి, సికిందర్ రజ చెరో వికెట్ ను సాధించారు.  

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  zimbamwe  anbati rayudu  murali vijay  akinya rahane  

Other Articles