chandrababu meets Rajnath singh asks for implementation of section-8 in hyderabad

Chandrababu busy in delhi after japan tour

chandrababu busy in delhi after japan tour, Chandrababu, ap chif minister, union home minister, rajnath singh, section-8, cash for vote, phone tapping, prakash javadekar, forest blocks, de-notification, piyush goel, electrical problems

AP CM chandrababu busy in delhi, with continiuous meetings with union ministers

హస్తిన పర్యటనలో చంద్రబాబు బిజీబిజీ..రాజ్ నాథ్ సింగ్ తో భేటీ..

Posted: 07/10/2015 01:40 PM IST
Chandrababu busy in delhi after japan tour

జపాన్‌ పర్యటనను ముగించుకుని గత రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రమంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూ.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇవాళ ఉదయం కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్‌జవదేకర్‌తో సీఎం భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి అటవీభూములు ఇవ్వాలని కోరామని సీఎం చంద్రబాబు తెలిపారు. డీనోటిఫై చేసి చట్టపరమైన అడ్డంకులు తొలిగించాలని కోరామని ఇందుకు జవదేకర్‌ సానుకూలంగా స్పందించినట్లు చంద్రబాబు చెప్పారు.

41 అటడీ బ్లాకులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డీ నోటిపై చేయమని కోరారని కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. అవసరమైన అన్ని బ్లాకులను డీ నోటిపై చేసేందుకు కేంద్రం సిద్దంగా వుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల అనుమతులను వేగవంతం చేసేందుకు కేంద్రం సిద్దంగా వుందని చెప్పారు. త్వరితగతిన అన్ని అనుమతులు ఇస్తామన్నారు. ఏపీ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని ప్రకాష్‌జవదేకర్‌ స్పష్టం చేశారు.
 
అంతకుముందు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రధానంగా విద్యుత్‌ కార్మికులకు సంబంధించిన సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీకి చెందిన 1,253 మంది విద్యుత్‌ ఉద్యోగులను టి.సర్కార్‌ రివీల్‌ చేసిందని దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని గోయల్‌ను కోరినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో సుమార్‌ 4000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి విధివిధానాలపై చర్చించినట్లు సమాచారం.
 
ఆ తరువాత ప్రస్తుతం కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చంద్రబాబునాయుడు భేటీ అయ్యారురు. సెక్షన్‌-8పైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్రజలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, నిధుల విడుదలలో జాప్యంపై చర్చించే అవకాశం ఉంది. ఈనెల 14 నుంచి జరుగనున్న గోదావరి పుష్కరాలకు ఉమాభారతిని ఆహ్వానించనున్నట్లు సమాచారం. అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో చంద్రబాబు భేటీ అవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ భేటీపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  rajnath singh  section-8  prakash javadekar  piyush goel  

Other Articles