Uttarpradesh | Free | Laptops | Akhilesh Yadav, samajvadi party, ssc, inter

Uttarpresdesh govt decided to disrtibute laptops to the students who will pass ssc and inter

Uttarpradesh, Laptops, Akhilesh Yadav, samajvadi party, ssc, inter

Uttarpresdesh Govt decided to disrtibute laptops to the students who will pass ssc and inter. The Uttapradesh cm Akhilesh Yadav clear to distribute laptops.

అక్కడ పది సాపైతే ల్యాప్ టాప్

Posted: 06/24/2015 03:47 PM IST
Uttarpresdesh govt decided to disrtibute laptops to the students who will pass ssc and inter

పదో తరగతి పాస్ అవడం అంటే అదో గొప్ప విఝయం.. కానీ అది ఒకప్పుడు తాతల కాలం నాటి మాట. కానీ ఇప్పుడు మాత్రం పది కాదు దేశవిదేశాల పరీక్షలను కూడా అవలీలగా పాస్ అవుతున్నారు విద్యార్థులు. అయితే తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ విద్యార్థులు పది పాసైనా ఇంటర్ పాసైనా ల్యాప్ ట్యాప్ ఇస్తామని అంటోంది. అయితే ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అక్కడి విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ ట్యాప్ లు పంపిణీ చేసింది. అయితే తాజాగా తమిళనాడు రాష్ట్రం బాటలోనే మరో రాష్ట్రం కూడా పయనిస్తోంది. అయితే ఇక్కడ విద్యార్థులను ఎంకరేజ్ చేసే ఉద్దేశం కాదు కానీ వేరే కారణం ఉంది. అసలు ఆ కారణం ఏంటో..? ఏ రాష్ట్రమో తెలుసుకోవాలంటే పూర్తి స్టోరీ చదవాల్సిందే.

పదో తరగతి, ఇంటర్ పాసైన విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందజేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. స్టేట్ బోర్డు, సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ బోర్డుల్లో చదివిన ప్రతిభావంతులైన 39 వేలపైగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేయాలని నిర్ణయించారు. సిఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ల్యాప్టాప్లలో సగం పదోతరగతి పాసైన విద్యార్థులకు, సగం ఇంటర్ పాసైనవాళ్లకు ఇవ్వనున్నారు. 2012 ఎన్నికల మేనిఫెస్టోలోనే ల్యాప్టాప్లు, టాబ్లెట్లను ఉచితంగా ఇస్తామన్న సమాజ్వాదీ ప్రభుత్వం హామీని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి అప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ల్యాప్ ట్యాప్ ల పంపిణీ విస్తరించింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttarpradesh  Laptops  Akhilesh Yadav  samajvadi party  ssc  inter  

Other Articles